CJI Sanjiv Khanna : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. ఆయన కుటుంబ నేపథ్యంలోకి వెళితే.. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి, తాతయ్య సరవ్ దయాల్ భారత స్వాతంత్య్రానికి పూర్వమే ప్రఖ్యాత లాయర్. పంజాబ్‌లో జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన కమిటీలో న్యాయవాది సరవ్ దయాల్ పనిచేసినట్లు తెలుస్తోంది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పూర్వీకుల మూలాలు పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు చెందిన చాలామంది పూర్వీకులు ఆ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇవాళ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనతో ఎమోషనల్‌గా అటాచ్ అయిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
Also Read :Jio Hotstar : ‘జియో హాట్‌స్టార్’ డొమైన్‌ను ఫ్రీగా ఇస్తాం.. రిలయన్స్‌కు జైనమ్, జీవిక ఆఫర్
సరవ్ దయాల్ ఫేమస్ లాయర్
పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరం శివారల్లో కత్రా షేర్‌సింగ్ అనే ఏరియా ఉంటుంది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అమృత్‌సర్‌కు వెళ్లినప్పుడల్లా తప్పకుండా కత్రా షేర్‌సింగ్ ప్రాంతాన్ని విజిట్ చేస్తుంటారు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. కత్రా షేర్‌సింగ్ ఏరియాకు వెళ్లినప్పుడల్లా సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా మదిలో ఒకే మాట మెదులుతుంటుంది. ఆ ఏరియాలో తన తాతయ్య సరవ్ దయాల్ కట్టిన ఇల్లును ఆయన కళ్లు వెతుకుతుంటాయి. మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే సరవ్ దయాల్ పంజాబ్‌లో ఫేమస్ లాయర్. అప్పట్లో ఆయన బాగానే డబ్బు సంపాదించారు. ఆ డబ్బుతో స్వాతంత్య్రానికి పూర్వం రెండు ఇళ్లను సరవ్ దయాల్ కొన్నారు. కత్రా షేర్‌సింగ్ ఏరియాలో ఒక ఇల్లు, హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ ఏరియాలో మరో ఇల్లును కొన్నారు. అయితే పంజాబ్‌లోని ఇంటికి కొందరు అల్లరిమూకలు స్వాతంత్య్ర ఉద్యమం టైంలో నిప్పు పెట్టారు. అయినప్పటికీ.. ఆ ఇంటిని సరవ్ రిపేర్ చేయించారు.
Also Read :Ram Gopal Varma : చంద్రబాబు, లోకేశ్, బ్రాహ్మణిలపై కామెంట్స్.. రామ్‌గోపాల్ వర్మపై కేసు
సీజేఐకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ..
సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాకు(CJI Sanjiv Khanna) ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నాతో కలిసి ఆ ఇంటికి వెళ్లారు. సీజేఐ తాతయ్యకు చెందిన ఈ రెండు ఇళ్ల ఎదుట ఏర్పాటు చేసిన నేమ్ బోర్డులపై ‘Bauji’ అని అప్పట్లో రాసి ఉండేదట. ఇప్పటికీ హిమాచల్‌లోని సరవ్ దయాల్ ఇల్లు అలాగే ఉంది. దాని ఎదుట నేమ్ బోర్డుపై Bauji అని రాసి ఉంది. అయితే సరవ్ దయాల్ తుదిశ్వాసం విడిచాక.. 1970వ దశకంతో అమృత్‌సర్‌లోని కత్రా షేర్‌సింగ్ ఏరియాలో ఉన్న ఇంటిని అమ్మేశారు. గత 54 ఏళ్లలో ఆ ఏరియా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నో కొత్త నిర్మాణాలు వచ్చాయి. కాలనీలలో చాలా మార్పులు జరిగాయి. దీంతో కత్రా షేర్‌సింగ్ ఏరియాకు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా వెళ్లినా.. తన తాతయ్య సరవ్ దయాల్ కట్టించిన ఇంటిని గుర్తుపట్టలేకపోతున్నారు.