Site icon HashtagU Telugu

Chhattisgarh New CM : ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌

Chhattisgarh New Cm

Chhattisgarh New Cm

Chhattisgarh New CM : ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా విష్ణుదేవ్‌ సాయ్‌‌ను బీజేపీ పరిశీలకులు ఎంపిక చేశారు. రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ 54 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో జరిగిన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఈవిషయాన్ని డిసైడ్ చేశారు. దీంతో ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ‌కు తెరపడింది. బీజేపీ జాతీయ నాయకత్వం పంపిన ముగ్గురు పరిశీలకుల సమక్షంలో 54 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, సర్వానంద సోనోవాల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఛత్తీస్‌గఢ్‌కు చేరుకొని ఈవిషయాన్ని ఓ కొలిక్కి తెచ్చారు. సీఎం రేసులో రమణ్ సింగ్, రేణుకా సింగ్‌, రాంవిచార్ నేతమ్, సరోజ్ పాండే, అరుణ్ సావో, ఓపీ చౌదరి ఉన్నప్పటికీ..  విష్ణు దేవ్ సాయ్‌ను(Chhattisgarh New CM) ఎంపిక చేసేందుకే పరిశీలకులు మొగ్గుచూపారు.

Also Read: Nayanthara : తమిళనాడులో సూపర్ స్టార్ వివాదం.. నయనతార ఏమందంటే?