8 Maoists Encounter : 8 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. ఓ సైనికుడి మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోంది.

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 01:17 PM IST

8 Maoists Encounter : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర బార్డర్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో ఉన్న అబూజ్‌మడ్ ప్రాంతంలో భీకర్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాన్ అమరుడయ్యాడు.  ఇంకో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

కుతుల్, ఫర్సాబెడ, కొడమెట ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ నెల 12నే నారాయణపూర్, కంకేర్, దంతేవాడ, కొండగావ్ జిల్లాల్లో పెద్దఎ్తతున భద్రతా బలగాలను మోహరించారు. వీరిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్),ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన దాదాపు 1400 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. గత రెండు రోజులుగా నారాయణ పూర్ జిల్లాలోని అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈక్రమంలో శనివారం ఉదయం అడవుల్లో  మావోయిస్టులు ఎదురుపడగా.. కాల్పులు మొదలయ్యాయి. కాల్పులు, ప్రతి కాల్పులతో అడవి దద్దరిల్లింది. ఈ క్రమంలోనే ఎనిమిది మంది మావోయిస్టులను(8 Maoists Encounter) భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మరణించిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read : Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్‌పై ఎఫెక్టు పడుతుందా ?

ఈ నెల 7న దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అప్పట్లో మావోయిస్టుల నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న జరిగిన ఎన్ కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

Also Read : Amaravati Vs Hyderabad : అమరావతిలో ‘రియల్’ బూమ్.. హైదరాబాద్‌పై ఎఫెక్టు పడుతుందా ?