Site icon HashtagU Telugu

Pm Modi Birthday Special: గ్వాలియర్ చేరుకున్న చిరుతలు..ఇవాళ అడవిలో వదలనున్న మోదీ ..!!

Cheetha

Cheetha

ఇవాళ దేశ ప్రధాని నరేంద్రమోదీ తన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆయన అభిమానులు. తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో మోదీ 8 చిరుతలను విడుదల చేయనున్నారు. నమీబియా నుంచి 8 చిరుతలతో ప్రత్యేక కార్గో విమానం శనివారం గ్వాలియర్ చేరుకుంది. ఈ 8 చిరుతల్లో ఐదు ఆడ,మూడ మగ చిరుతలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నమీబియా నుంచి ప్రాజెక్టు చిరుతలో భాగంగా భారత్ కు తీసుకువచ్చారు. ప్రధాని మోదీ ఉదయం 9.20 గంటలకు న్యూఢిల్లీ నుంచి గ్వాలియర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10.45 గంటలకు మోదీ చిరుతలను అడవిలో వదిలేస్తారు.

మధ్యప్రదేశ్‌కు చిరుతలు తీసుకురాడం సంతోషంగా ఉంది: చౌహన్
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌కు ఇదో పెద్ద కానుక అన్నారు. నమీబియా నుండి మధ్యప్రదేశ్‌లోని ఇండియాస్ కునో నేషనల్ పార్క్‌కి కూడా చిరుతలు వస్తున్నాయంటే ఇంతకంటే పెద్ద బహుమతి మరొకటి ఉండదన్నారు.