Kuno National Park: కూనో నేషనల్ పార్క్ నుంచి పారిపోయిన మరో చీతా..!

కూనో నేషనల్ పార్క్ (Kuno National Park) నుంచి ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ అనే చీతాను తీసుకురాగానే.. ఆశా అనే మరో చీతా తప్పించుకుని బఫర్ జోన్‌లోకి వెళ్లిపోయింది.

Published By: HashtagU Telugu Desk
Kuno National Park

Cheetah

కూనో నేషనల్ పార్క్ (Kuno National Park) నుంచి ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ అనే చీతాను తీసుకురాగానే.. ఆశా అనే మరో చీతా తప్పించుకుని బఫర్ జోన్‌లోకి వెళ్లిపోయింది. అయితే ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదంలేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.కానీ బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఇటీవల 4 చీతాలను ఫ్రీ ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టారు.

షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సందడి అటవీ శాఖ అధికారులకు నిద్రలేకుండా చేస్తుంది. ఒబాన్ చిరుత తర్వాత ఇప్పుడు ఆడ చిరుత ఆశా కూడా పార్క్ ప్రాంతం నుండి బయటకు వచ్చింది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ఆశా అని పేరు పెట్టారు. బుధవారం వీర్‌పూర్‌-విజయపూర్‌ ప్రాంతంలోని బఫర్‌ జోన్‌ అటవీ ప్రాంతంలో ఆశా ఆచూకీ లభించింది. ASHA గత రెండు, మూడు రోజులుగా కునో, దాని పరిసర పొలాల బఫర్ జోన్‌లో ఉంది. ఆశా కొన్నిసార్లు కునో రిజర్వ్ జోన్‌లోని అడవిలోకి, కొన్నిసార్లు బఫర్ జోన్‌లోకి చేరుకుంటుంది. ఎక్కువగా నదులు, కాలువల చుట్టూ తిరుగుతుంది. అటవీ శాఖ బృందం కూడా ఆశాపై నిరంతరం నిఘా ఉంచింది.

Also Read: PM Modi: ఏప్రిల్ 8, 9 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

శనివారం రాత్రి ఒబాన్ కునో నేషనల్ పార్క్ నుండి బయటకు వెళుతున్నప్పుడు ఒక ఆవును వేటాడింది. ఆ తర్వాత మరే ఇతర అడవి జంతువును వేటాడలేదు. చిరుతలు మనుషుల నివాసాలకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయని అధికారులు చెబుతున్నారు. అవి మనుషులపై కూడా దాడి చేయవని అంటున్నారు. చిరుతల భద్రత కోసం కునో నేషనల్ పార్క్‌లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏడు నెలల ప్రత్యేక శిక్షణ అనంతరం మంగళవారం పంచకుల నుంచి ఫిమేల్ జర్మన్ షెపర్డ్ డాగ్ ను పార్కుకు తీసుకొచ్చారు. వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లను పట్టుకోవడంలో ఇది సహాయం చేస్తుంది. 11 నెలల వయసున్న షెపర్డ్ డాగ్ ఇప్పుడు కునో నేషనల్ పార్క్ అడవుల్లోకి వేటగాళ్లు రాకుండా ప్రతి సందు, మూలను కంటికి రెప్పలా కాపాడుతుంది.

  Last Updated: 06 Apr 2023, 06:55 AM IST