Aadhaar History : ఆధార్‌ హిస్టరీ.. ఒకే ఒక్క క్లిక్ దూరంలో !!

Aadhaar History : ఆధార్‌ కార్డ్‌ ప్రతీ పనికి అవసరమే. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా దాన్ని మనం ఇస్తుంటాం.

  • Written By:
  • Updated On - March 17, 2024 / 09:25 PM IST

Aadhaar History : ఆధార్‌ కార్డ్‌ ప్రతీ పనికి అవసరమే. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్‌ కార్డు తీసుకోవాలన్నా దాన్ని మనం ఇస్తుంటాం. దీంతో ఈ కార్డ్‌ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామో మనకు గుర్తుండటం లేదు. వేరెవరైనా దీన్ని వాడుతున్నారా అనే డౌట్ వస్తే ఎలా ? ఆధార్ కార్డ్ వినియోగానికి సంబంధించిన హిస్టరీని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ? అది చాలా ఈజీ గురూ !! ఈ సీక్రెట్‌ను మీరు తెలుసుకుంటే.. మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్‌ను(Aadhaar History) వాడితే తెలిసిపోతుంది. ఎటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడకుండా నిలువరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

We’re now on WhatsApp. Click to Join

ఆధార్ హిస్టరీని చూడటం ఇలా.. 

  • దీని కోసం ఉడాయ్‌ https://uidai.gov.in/en/ పోర్టల్‌కు వెళ్లాలి.
  • పైన ఎడమవైపు ఉన్న My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar servicesపై క్లిక్‌ చేయాలి.
  • కిందకు స్క్రోల్ చేసి Aadhaar Authentication History అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. వెంటనే లాగిన్‌ కోసం కొత్త పేజ్‌ ఓపెన్‌ అవుతుంది.
  • అందులో లాగిన్‌పై క్లిక్‌ చేసి ఆధార్‌ నెంబర్‌, క్యాప్చా, ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి.
  • తర్వాత కనిపించే స్క్రీన్‌లో కిందకు స్క్రోల్ చేయగానే Authentication History అని కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
  • అక్కడ ALL ని ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్‌ చేసుకొని Fetch Authentication History పై క్లిక్‌ చేయాలి.
  • ఆధార్‌కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది.

Also Read :Navodaya Jobs 1377 : ‘నవోదయ’లో 1377 జాబ్స్.. అప్లై చేసుకోండి

ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లకు ఆధార్ కార్డ్‌

ఎన్ఆర్ఐలు, ఓసీఐ కార్డ్ హోల్డర్లు ఆధార్ కార్డ్‌ని పొందటానికి భారత ప్రభుత్వం కొత్త ఆధార్ నిబంధనలను తీసుకువచ్చింది. దీని కోసం UIDAI ప్రత్యేక ఫామ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఉపయోగించి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) వారు ఆధార్ ఎన్‌రోల్ చేసుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఐగా మీకు లేదా మీ మైనర్ పిల్లలకు ఆధార్‌ను కావాలనుకునే.. స్వదేశానికి తిరిగి వెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకునే వారు పాస్‌పోర్ట్‌ను ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 2023 అక్టోబర్ 1 తర్వాత పుట్టిన దరఖాస్తుదారులకు జనన ధృవీకరణ పత్రం (Birth Certificate) తప్పనిసరి. ఆధార్ కార్డు పొందిన తరువాత కూడా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం అవసరం. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్ఆర్ఐలు మాత్రమే కాకూండా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ.. చిరునామాను డేటాబేస్‌లో తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చు.