Site icon HashtagU Telugu

Petrol-Diesel Price: చమురు ధరల తాజా అప్ డేట్.. ఇక మీరు మీ ఫోన్ కే పొందొచ్చు

Free At Petrol Pump

Free At Petrol Pump

చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఇవాళ (డిసెంబర్ 27న) కూడా అప్‌డేట్ చేశాయి. అయితే రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేసిన కొత్త రేటు ప్రకారం.. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో వాహనాల ఇంధన ధరలు ఒకే విధంగా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో చమురు ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

మెట్రో నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అధికారిక వెబ్‌సైట్ iocl.com తాజా అప్‌డేట్ ప్రకారం..
* ఈ రోజు (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 , లీటర్ డీజిల్ ధర రూ. 89.62.
* చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63 కాగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.
* అదే సమయంలో కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది.
* ఇది కాకుండా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోలు రూ.106.31కు , లీటర్ డీజిల్ రూ.94.27కు విక్రయిస్తున్నారు.
* ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 96.72, లీటరు డీజిల్ ధర రూ. 89.62 ఉంది.
* నోయిడాలో లీటరు పెట్రోల్ ధర
రూ. 96.79, లీటరు డీజిల్ ధర రూ. 89.96, ఘజియాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ.96.58,
లీటరు డీజిల్ ధర రూ. 89.75,గురుగ్రామ్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.97.18, లీటర్ డీజిల్ ధర
రూ. 90.05 వద్ద ఉంది.

SMS ద్వారా మీరూ తెలుసుకోవచ్చు..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ని బట్టి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సమీక్షించిన తర్వాత ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. అయితే చాలా కాలంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో చమురు కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. మీ నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను SMS ద్వారా తనిఖీ చేయండి.
రాష్ట్ర స్థాయిలో విధించిన పన్ను కారణంగా, వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. మీరు ప్రతిరోజూ మీ నగరంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలను SMS ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ రేట్ల కోసం మీ నగరం RSP కోడ్ ను టైప్ చేసి 9224992249 నంబర్‌కు పంపండి. కొన్ని నగరాల RSP కోడ్స్ కింద ఇస్తున్నాం చూడండి.

* New DelhiRSP- 102072

* MumbaiRSP- 108412

* VisakhapatnamRSP- 127290

* HyderabadRSP- 134483

* VijayawadaRSP- 127611

Exit mobile version