హ్యాట్రిక్ లక్ష్యంగా వారణాసిలో ప్రధాని మోడీ ఈరోజు తన నామినేషన్ దాఖలు చేసారు. ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసి విజయం సాధించిన మోడీ..ముచ్చటగా మూడోసారి విజయం సాధించి దేశానికి హ్యాట్రిక్ పీఎం కావాలని భావిస్తున్నారు. మోడీ నామినేషన్ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఆయన సన్నిహితులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath), కేంద్రమంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏపీ టీడీపీ అధినేత, చంద్రబాబు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2047కు వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ కృషిచేస్తున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఏపీలో NDA క్లీన్ స్వీప్ చేస్తుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నామినేషన్ కు ముందు గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయన గంగా హారతి నిర్వహించారు. ప్రధాని మోదీతో పూజారి రామణ్ పూజలు చేయించారు. దేశ సంక్షేమం కోసం గంగా పూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మూడవ సారి మోదీ ప్రధాని కావాలని, దేశ ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోవాలని కోరుకున్నట్లు పూజారి రామణ్ వెల్లడించారు. అన్ని దశల ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఘన విజయం లభించాలని ఆశీర్వదించినట్లు మరో పూజారి సంతోష్ నారయన్ తెలిపారు.
Read Also : TS : రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కేటిఆర్ సమావేశం