Diwali : దీపావళి రోజున.. కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చాలంటూ ప్రభుత్వం ఆదేశం

ఈసారి దీపావళి రోజున కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు పటాకులు కాల్చాలని , అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తామని

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 04:07 PM IST

దీపావళి (Diwali) అంటేనే టపాసుల మోత (Diwali Crackers) మోగాల్సిందే..ఎవరు ఎక్కువ టపాసులు కాలిస్తే వారే తోపు..టపాసుల సౌండ్ తో దద్దరిల్లిపోవాల్సిందే..ఇలా ప్రతి ఒక్కరు భవిస్తూ..దీపావళి పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటుంటారు. కానీ ఈ ఒక్క రోజు వల్ల గాలి కాలుష్యం ఎంతో అవుతుందో..దాని వల్ల ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయి చాలామంది పట్టించుకోరు. అందుకే దీపావళి వస్తుందంటే పర్యావరణ నిపుణులు పలు జాగ్రత్తలు , సూచనలు తెలియజేస్తుంటారు. తాజాగా చండీగఢ్‌ అధికార యంత్రాంగం ఈ దీపావళికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

చండీగఢ్‌ (Chandigarh )లో ప్రతి సంవత్సరం దీపావళి నాడు అధిక మోతాదులో గాలి కలుషితమవుతుందట. అందుకే ఈసారి దీపావళి రోజున కేవలం 2 గంటల పాటు మాత్రమే పటాకులు కాల్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు పటాకులు కాల్చాలని , అది కూడా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో కూడా పటాకులు కాల్చడం, అమ్మడం నిషేధించారు. చలికాలంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది కూడా ఢిల్లీలో అన్ని రకాల పటాకుల అమ్మకాలు, నిల్వలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.

Read Also : Samantha: హాలీడే మూడ్ లో సమంత, నెక్ట్స్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!