కేంద్ర ప్రభుత్వం 200 కొత్త టీవీ చానళ్లు ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం దాదాపు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఇంతకీ ఏమిటా టీవీ చానళ్ళ లక్ష్యం అనుకుంటున్నారా? దేశంలోని ప్రతి భాషలో .. ప్రతి తరగతి కి సంబంధించిన పాఠ్యాంశాలు బోధించడమే వాటి టార్గెట్. ఈవిషయాన్ని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దేశంలోని మారుమూల , వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో టీవీ చానళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ లోని Nit హమీర్ పూర్ లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలోనూ ఇదే విషయాన్ని ఆయన తెలిపారు. రాబోయే 200 టీవీ ఛానళ్లలో ప్రసారం చేసేందుకు ఆడియో విజువల్ గేమింగ్ ఆధారిత ఎడ్యుకేషన్ కంటెంట్ ను అభివృద్ధి చేయాలని Nit హమీర్ పూర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
New TV Channels : 1000 కోట్లతో 200 టీవీ చానళ్లు .. ఎందుకో తెలుసా?

Tv Channels