Site icon HashtagU Telugu

Census : 2025లో జనగణన.. 2028లో లోక్‌సభ స్థానాల పునర్విభజన

Caste Census Report

Caste Census Report

Census : మనదేశంలో జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది (2025 సంవత్సరం) ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనగణనలో భాగంగా దేశ ప్రజల వివరాలను సేకరించే ప్రక్రియ 2026 వరకు కొనసాగనుంది. జనగణన పూర్తయిన తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రక్రియ 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసారి పూర్తిగా డిజిటల్‌ విధానంలో, అత్యంత పారదర్శకంగా జనగణన సర్వే జరుగుతుందని చెప్పాయి. కులగణన చేయాలని ఎన్డీయే కూటమిలోని జేడీయూ, ఎల్‌జేపీ సహా పలు మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మిత్రపక్షాల డిమాండ్‌ను నెరవేర్చే దిశగా ఈసారి జనగణన సర్వే షీట్‌లో(Census) కులం అనే కేటగిరినీ చేరుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.

Also Read :Terror Attack : కశ్మీరులో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు.. మళ్లీ ఉద్రిక్తత

Also Read :Rama Ekadashi : ఇవాళ రామ ఏకాదశి.. ఉపవాసం, పూజా విధానం వివరాలివీ..