Covid-19: కరోనాలో మరో ‘సూపర్ స్ట్రెయిన్’ ఏయే దేశాల్లో ఎన్ని కొత్తరకం కేసులో చూడండి

కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. మరోవైపు కొత్త కొత్త వేరియంట్స్ కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి.

  • Written By:
  • Updated On - November 25, 2021 / 11:10 PM IST

కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. మరోవైపు కొత్త కొత్త వేరియంట్స్ కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా, హంకాంగ్ లో వచ్చిన కొత్త స్ట్రెయిన్ బి.1.1529 ప్రపంచాన్ని మళ్ళీ భయపెడుతోంది. ఈ స్ట్రెయిన్ బి.1.1 రకం నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అయినట్లు వైద్యులు తెలిపారు.

నూతన వేరియంట్ లోని స్పైక్ మ్యుటేషన్లు వైరస్ ను తొందరగా స్ప్రెడ్ చేసే ప్రమాదముందని, అందుకే దీన్ని సూపర్ స్ట్రెయిన్ గా పరిగణిస్తున్నామని
వైద్యులు తెలిపారు. ఈ న్యూ వేరియంట్ పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. కొత్త వేరియంట్ ఇబ్బందికరంగా ఉందని దీనిపై అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖ కూడా రాశారు.

విదేశాల నుంచి వచ్చేవారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వేరియంట్ స్ప్రెడ్ అవుతున్న దేశాలైన సౌత్ ఆఫ్రికా, హాంకాంగ్ , బోత్స్వానా దేశాల నుండి వచ్చే ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చింది.

తాజాగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మొదలయ్యాయి అయితే విదేశాలనుండి కరోనా కేసులు వచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో వైద్యులు ఆందోళనలో ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఈ తరహా కేసులను సౌత్ ఆఫ్రికాలో 22 కేసులను, హాంకాంగ్ లో 2 కేసులను, బోత్స్వానాలో 4 కేసులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు.