Site icon HashtagU Telugu

Centre Hikes MSP : రైతుల‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర పెంపు..!

Kharif

Kharif

రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2023-24 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి ఆరు రబీ పంటల‌కు కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. క్వింటాల్‌కు రూ.100 నుండి రూ.500కి పెంచింది. కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడతను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసిన త‌రువాత మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. MSP విధానంలో, ప్రభుత్వం పంటలకు కనీస ధరను నిర్ణయిస్తుంది. కొన్ని పంటల ధరలు పడిపోయినా, నష్టాల నుంచి కాపాడేందుకు కేంద్రం వాటిని రైతుల నుంచి ఎంఎస్‌పీకి కొనుగోలు చేస్తుంది. గోధుమల కనీస మద్దతు ధరను రూ.110 పెంచారు. దీంతో క్వింటాల్‌ ధర రూ.2,125కు చేరింది. బార్లీ ధరను రూ.100 పెంచడంతో క్వింటార్‌ ధర రూ.1735కు పెరిగింది. శనగల కనీస మద్దతు ధరను రూ.5,230 నుంచి రూ.5,335కు పెంచారు. మసూర్‌ పంట మద్దతు ధరను రూ.500 పెంచడంతో క్వింటాల్‌ ధర రూ.6000కు చేరింది. నువ్వుల కనీస మద్దతు ధరను రూ.5,050 నుంచి రూ.5,450కి పెంచారు. కుసుమ పంట మద్దతు ధరపై రూ.209 పెంచారు. దీంతో క్వింటాల్‌ ధర రూ.5,650కి చేరింది.