Free Rice Scheme : రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచిత బియ్యం/ఆహార ధాన్యాలను అందించే ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ స్కీంను 2028 డిసెంబరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు ఇవాళ కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ఉచిత బియ్యం పంపిణీకి ఉద్దేశించిన ఈ స్కీంకు(Free Rice Scheme) రూ.17,082 కోట్లను ఖర్చు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ బియ్యంలో పోషకాలను జోడించి ఫోర్టిఫైడ్ రైస్‌ను తయారు చేస్తారు. పీఎంజీకేఏవైలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 100 శాతం సొంత నిధులతో పోషక విలువలతో కూడిన ఫ్టోర్టిఫైడ్ రైస్‌ని అందిస్తోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ చేసిన ప్రకటన ప్రకారమే.. ఉచిత బియ్యం పంపిణీ కొనసాగింపుపై ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా ఈ బియ్యాన్ని ఉచితంగా అందజేయనున్నారు.
Also Read :Gamma Ray Telescope : ప్రపంచంలోనే ఎత్తైన గామారే టెలిస్కోప్.. లడఖ్‌లోనే ఎందుకు ఏర్పాటు చేశారంటే..
- గుజరాత్‌లోని లోథాల్‌లో ‘నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్’ అభివృద్ధికి కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.
- రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల బార్డర్‌లో రూ.4,406 కోట్లతో 2280 కి.మీ మేర రోడ్ల నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలిపింది.
Also Read :Nobel Prize 2024 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
తెలంగాణ బియ్యానికి విదేశీ డిమాండ్
వరి సాగులో మన దేశంలోనే అగ్రగామి తెలంగాణ. గతేడాది తెలంగాణలో 1.2 కోట్ల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, 2.6 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. రాష్ట్రంలో వరిసాగుకు దాదాపు 220 రకాల విత్తనాలను వినియోగించారు. వీటిలో 60 శాతం ముతక రకాలు, 40 శాతం ఫైన్, సూపర్ ఫైన్ వెరైటీలు ఉన్నాయి. రాష్ట్రంలో సోనామసూరి, హెచ్‌ఎంటీ, సాంబమసూరి, ఎంటీయూ- 1010, ఐఆర్- 64, జేజీఎల్ వెరైటీలు కూడా పండిస్తున్నారు. తెలంగాణ బియ్యానికి ఫిలిప్పైన్స్, అమెరికా, బంగ్లాదేశ్, యూఏఈ, ఉత్తర కొరియా దేశాలలో మంచి డిమాండ్ ఉంది.