Site icon HashtagU Telugu

Caste Column : ఈసారి జనగణన ఫార్మాట్‌లో ‘కులం’ కాలమ్.. కేంద్రం యోచన

Caste Column In Population Census

Caste Column : జనాభా లెక్కల సేకరణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయనుంది. ఈనేపథ్యంలో దానితో ముడిపడిన ఒక కొత్త అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈసారి జనగణన వివరాలను సేకరించి ఫార్మాట్‌లో కులానికి సంబంధించిన కాలమ్‌ను చేర్చనున్నట్లు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి  జనగణన ప్రక్రియ గత నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు దాని నిర్వహణకు కొన్ని రోజుల్లోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.

Also Read :Jammu Election : కశ్మీర్ ఎన్నికల్లో కాషాయ పార్టీ వ్యూహం ఏమిటో తెలుసా ?

ఎన్డీయే కూటమి ఈసారి మిత్రపక్షాల బలంపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. జేడీయూ, టీడీపీ లాంటి పార్టీలు దానికి వెన్నెముకల్లా ఉన్నాయి. కులగణన నిర్వహించాలని నితీశ్ కుమార్ రాజకీయ పార్టీ  జేడీయూ బలంగా డిమాండ్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కూడా దేశవ్యాప్తంగా కులగణన ఆవశ్యకత గురించి మాట్లాడుతున్నాయి. అందుకే జనగణన వివరాలను సేకరించే ఫార్మాట్‌లోనే కులానికి సంబంధించిన కాలమ్‌ను చేర్చనున్నట్లు తెలిసింది. కులాల వారీగా దేశ ప్రజల జనసంఖ్యను తెలుసుకొని సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయడంలో తప్పేం లేదని బీజేపీ పేరెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ అంటోంది. అందుకే ఈ విషయంలో బీజేపీ వైఖరి మారింది. ఈక్రమంలోనే జనగణన ఫార్మాట్‌లో కులం కాలమ్‌ను(Caste Column) చేర్చాలని యోచిస్తోంది.

Also Read :PM Modis Portrait : 800 కేజీల మిల్లెట్లతో ప్రధాని మోడీ చిత్రం.. స్కూలు విద్యార్థిని క్రియేటివ్ విషెస్

జమిలి ఎన్నికల మంత్రాన్ని కూడా బీజేపీ ఇప్పుడు జపిస్తోంది. ఈసారి ఎన్డీయే కూటమి టర్మ్‌లోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దానికి పార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్రపతి ఆమోదం పొందాలని భావిస్తోంది. ఈ బిల్లును అమల్లోకి తెచ్చేందుకుగానూ రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌ను సవరించనున్నట్లు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో కూడా ‘వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌’ ప్రస్తావన ఉంది. దాన్ని ఈ టర్మ్‌లోనే  దేశంలో అమల్లోకి తేవాలనే పట్టుదలతో కాషాయ పార్టీ ఉందట.

Also Read :Saripodhaa Sanivaaram OTT : 10 రోజుల్లో ఓటిటి లో సందడి చేయబోతున్న ‘సరిపోదా శనివారం’