Site icon HashtagU Telugu

Gas Based Power Plants: సమ్మర్ కారణంగా దేశంలో గ్యాస్ విద్యుత్ ప్లాంట్లు

Gas Based Power Plants

Gas Based Power Plants

Gas Based Power Plants: వేసవి కాలంలో విద్యుత్ వినియోగం తారాస్థాయికి చేరుతుంది. 24 గంటల పాటు ఫ్యాన్లు, కూలర్లు నడుస్తూనే ఉంటాయి. ఇక ఏసీల వినియోగం ద్వారా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ లేమీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సమ్మర్ లో దేశంలో అధిక విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్యాస్ ఆధారిత ఉత్పాదక కేంద్రాల నుండి గరిష్ట విద్యుత్ ఉత్పత్తి కోసం , విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 11 ప్రకారం అన్ని గ్యాస్ ఆధారిత ఉత్పాదక కేంద్రాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉత్పాదక కేంద్రాన్ని అమలు చేయాలనీ విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

We’re now on WhatsAppClick to Join

వాణిజ్యపరమైన అంశాల కారణంగా సెక్షన్ 11 కింద దిగుమతి చేసుకున్న-బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల మాదిరిగానే, గ్యాస్ ఆధారిత ఉత్పాదక కేంద్రాల నుండి విద్యుత్ లభ్యతను ఆప్టిమైజ్ చేయడం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మే 1, 2024 నుండి జూన్ 30, 2024 వరకు విద్యుత్ ఉత్పత్తి సరఫరా చెల్లుబాటులో ఉంటుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదేవిధంగా గ్రిడ్-ఇండియా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు ఎన్ని రోజులు గ్యాస్ ఆధారిత విద్యుత్ అవసరమో ముందుగానే తెలియజేస్తుందని విద్యుత్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read: Bournvita : బోర్న్‌వీటా ‘హెల్త్ డ్రింక్’ కాదు.. మోడీ సర్కారు కీలక ఆదేశం