Centre approves 4% Hike in DA : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించిన మోడీ సర్కార్

తాజాగా కేంద్రం ప్రకటించిన 4 శాతం పెంపుతో డీఏ 46 శాతానికి పెరగనుంది. మొత్తం మూడు నెలల ఆరియర్స్ కలిపి ఉద్యోగులకు జీతంతో కలిపి అందజేస్తారు.

Published By: HashtagU Telugu Desk
Government Employees

Government Employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Government Employees) కేంద్ర సర్కార్ బిజెపి తీపి కబురు తెలిపింది. డీఏ (DA) పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు దసరా కానుక ను అందచేసింది. 4 శాతం డీఏ (4% Hike DA) పెంపునకు కేంద్ర కేబినెట్ (BJP) ఆమోదం తెలిపింది. పెరిగిన డీఏ ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఉద్యోగుల‌కు డీఏ 42 శాతంగా ఉండగా… ఇప్పుడు తాజాగా కేంద్రం ప్రకటించిన 4 శాతం పెంపుతో డీఏ 46 శాతానికి పెరగనుంది. మొత్తం మూడు నెలల ఆరియర్స్ కలిపి ఉద్యోగులకు జీతంతో కలిపి అందజేస్తారు. ఈ ఏడాది మొదటి డీఏ పెంపు ప్రకటన మార్చిలో రాగా.. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేశారు. దేశవ్యాప్తంగా 48 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఉద్యోగుల బేసిక్ శాలరీ-రూ.56,900 అయితే ఇలా..

  •  కొత్త డీఏ (46 శాతం)-నెలకు రూ.26,174
  •  ప్రస్తుత డీఏ (42 శాతం)-నెలకు రూ.23,898
  •  డీఏ ఎంత పెరిగింది- నెలకు రూ.2276
  •  ఏటా పెరుగుదల ఎంత..?- రూ.27,312

బేసిక్ శాలరీ-రూ.18 వేలు అయితే ఇలా..

  •  బేసిక్ శాలరీ -రూ.18,000
  •  కొత్త డీఏ (46 శాతం)-నెలకు రూ.8,280
  •  ప్రస్తుత డీఏ (42 శాతం)-నెలకు రూ.7,560
  •  డీఏ ఎంత పెరిగింది-నెలకు రూ.720
  •  ఏటా పెరుగుదల ఎంత..?- రూ.8,640

Read Also : BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం అగ్ర నేతలను దించుతున్న బిజెపి

  Last Updated: 18 Oct 2023, 02:20 PM IST