PM Surya Ghar Muft Bijli Yojana: పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

  PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్తుపై కేంద్ర స‌ర్కారు కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న(PM Surya Ghar Muft Bijli Yojana) ప‌థ‌కానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం(Union Cabinet Approval) ద‌క్కింది. సోలాప్ ప‌వ‌ర్ సిస్ట‌మ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఖ‌ర్చులో కేంద్ర ప్ర‌భుత్వం సుమారు 78 వేలు ఇవ్వ‌నున్న‌ది. దేశ‌వ్యాప్తంగా దాదాపు కోటి ఇండ్ల‌కు ఈ ప‌థ‌కం అమలు […]

Published By: HashtagU Telugu Desk
Centre Approves 75,000 Cro

Centre Approves 75,000 Cro

 

PM Surya Ghar Muft Bijli Yojana: సౌర విద్యుత్తుపై కేంద్ర స‌ర్కారు కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న(PM Surya Ghar Muft Bijli Yojana) ప‌థ‌కానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం(Union Cabinet Approval) ద‌క్కింది. సోలాప్ ప‌వ‌ర్ సిస్ట‌మ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన ఖ‌ర్చులో కేంద్ర ప్ర‌భుత్వం సుమారు 78 వేలు ఇవ్వ‌నున్న‌ది. దేశ‌వ్యాప్తంగా దాదాపు కోటి ఇండ్ల‌కు ఈ ప‌థ‌కం అమలు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఉచిత క‌రెంటు స్కీమ్ కింద కేంద్ర ప్ర‌భుత్వం దాదాపు 76 వేల కోట్లు కేటాయించింది. రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం ప్ర‌భుత్వం కొంత ఖ‌ర్చును అందివ్వ‌నున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 13వ తేదీన ఈ స్కీమ్‌ను ప్ర‌ధాని మోడీ లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ మీడియాకు వెల్ల‌డించారు. ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో ఇవాళ క్యాబినెట్ భేటీ జ‌రిగింద‌ని, ఉచిత క‌రెంటు ప‌థ‌కానికి ఆమోదం ద‌క్కింద‌ని, ఈ స్కీమ్ కింద కోటి మంది కుటుంబాల‌కు 300 యూనిట్ల క‌రెంటు ప్ర‌తి నెల‌ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇక 2025 నాటికి అన్ని కేంద్ర ప్ర‌భుత్వ బిల్డింగ్‌లపై రూఫ్‌టాప్ సోలార్ ప‌వ‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నట్లు మంత్రి చెప్పారు.

read also : Akhilesh Yadav: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు సిద్ధం: అఖిలేష్

  Last Updated: 29 Feb 2024, 04:18 PM IST