Site icon HashtagU Telugu

India Railway: రైల్వే శాఖ నిర్వహిస్తున్న రైలు రెస్టారెంట్ గురించి మీకు తెలుసా?

Wheels

Wheels

India Railway: రైల్వే శాఖ ప్రయాణికుల కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఇక అలానే ఇండియన్ రైల్వే.. ప్రయాణికుల కోసం గత కొన్నాళ్లుగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో రెస్టారెంట్లను ప్రారబిస్తోంది. రైల్వే శాఖ ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అక్టోబర్ 10వ తేదీన కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అయితే అంతకంటే ముందుగా బీహార్ లోని కటిహర్ రైల్వేస్టేషన్‌లో ఏసీ కోచ్‌లతో తొలి రెస్టారెంట్‌ను ఆగస్టు 10న ప్రారంభించారు.

ఈ రెస్టారెంట్ 24 గంటలు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రయాణికులకు సరసమైన ధరలకు ఆహార పదార్థాలను అందించనునట్లు వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రలోని నాగపూర్ రైల్వే స్టేషన్‌లో వీల్స్ ఆన్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. ఆ రెస్టారెంట్ లో ఒకేసారి 40 మంది కూర్చొని తినే విధంగా అద్భుతంగా దానిని డిజైన్ చేశారు. ఈ రెస్టారెంట్ కూడా 24 గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా తయారు చేశారు. గత ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సూల్ రైల్వే స్టేషన్లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

ఇందులో కూడా ప్రయాణికులకు సరసమైన ధరలో రుచికరమైన ఆహర పదార్థాలు లభించనున్నాయి. గత ఏడాది ముంబైలోని సీఎస్ ఎంటీ రైల్వే స్టేషన్లో కూడా ఒక రెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు మరొక నాలుగు ప్రదేశాలలో కూడా రెస్టారెంట్ ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది రైల్వే శాఖ. అయితే కొత్తగా మొదలు పెట్టనున్న ఆ నాలుగు రెస్టారెంట్లు ఎక్కడ నిర్మించబోతోంది అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Exit mobile version