Site icon HashtagU Telugu

Marriages: మద్యానికి బానిసైన వ్యక్తికి పెళ్లి చేయొద్దు!

marriage

marriage

మందుబాబులు (alcoholic) జర జాగ్రత్త. అదే పనిగా మందు తాగుతున్నారా.. అయితే అలర్ట్ కావాల్సిందే. లేకుంటే భవిష్యత్తులో పెళ్లి చేసుకునేందుకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఇప్పటికే అలాంటివాళ్లను ఆడబిడ్డల తల్లిదండ్రులు దూరంగా పెడుతుండగా, తాజాగా కేంద్ర మంత్రి (Koushal Kishore) సైతం హెచ్చరికలు జారీ చేయడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మద్యానికి బానిసైన అధికారి కంటే ఓ రిక్షా కార్మికుడు, లేదా కూలీ పెళ్లికొడుకుగా మంచి ఎంపిక అని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వ్యాఖ్యానించారు.

తమ కుమార్తెలు, అక్కాచెల్లెళ్లను మద్యానికి అలవాటైనవారికి (alcoholic) ఇచ్చిపెళ్లి చేయొద్దని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లంభువా అసెంబ్లీ నియోజకవర్గంలో మద్యం (alcoholic) అలవాటు విముక్తి పై నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘నా కుమారుడు మద్యానికి బానిస అయ్యాడు. వెంటనే వెంటనే డ్రగ్ డీ అడిక్షన్ చేర్పించాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నాడు. మళ్లీ స్నేహితులతో కలిసి పార్టీలకు, పంక్షన్లకు వెళ్తూ మద్యం అలవాటు చేసుకున్నాడు. విపరీతమైన మద్యం కారణంగా నా కుమారుడు చనిపోయాడు. నా కుమారుడు చనిపోయే సమయానికి అతనికి రెండేళ్ల కుమారుడు ఉండటం దురదుష్టకరం’’ అని అన్నాడు.

Exit mobile version