Nitin Gadkari: రాజకీయాలకు గడ్కరీ గుడ్ బై చెప్పనున్నారా!

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరుకు బీజేపీ నేతే అయినా.. కొన్ని విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు.

  • Written By:
  • Updated On - July 26, 2022 / 04:46 PM IST

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరుకు బీజేపీ నేతే అయినా.. కొన్ని విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. సమాజంలో సంస్కరణల గురించీ చెబుతుంటారు. ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో బీజేపీ డిఫెన్స్ లో పడింది. సమాజం అభివృద్ధి బాటలో పయనించడానికి రాజకీయాలు చేయాలని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదని.. కేవలం అధికారం చేజిక్కించుకోవడానికే రాజకీయాలను అస్త్రంగా వినియోగిస్తున్నారని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. అందులో ఈ కీలక వ్యాఖ్యలు చేయడంతో.. ఇప్పుడవి దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పవర్ కోసం పవర్ గేమ్ ఆడుతోంది బీజేపీ. ఇలాంటి సమయంలో నితిన్ గడ్కరీ స్టేట్ మెంట్ సంచలనంగా మారింది. జీవితమంటే కేవలం రాజకీయాలు కాదని.. అంతకుమించిన జీవితం ఉందన్నారు నితిన్ గడ్కరీ. అందుకే తనకు రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అయినా రాజకీయాలను దేశంలో ఆర్థిక, సామాజిక సంస్కరణలో కోసం ఉపయోగించాలని.. సంక్షేమం కోసం కృషి చేయాలని అన్నారు. దీనికి పాలిటిక్స్ ను ఓ అస్త్రంగా వినియోగించుకోవాలన్నారు. కానీ ప్రస్తుతం అధికారంపై మక్కువతోనే రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీంతో నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై వివిధ పార్టీల్లో డిస్కషన్ నడుస్తోంది. ఆయన బీజేపీని ఉద్దేశించే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నాయి. ఒకవేళ బీజేపీ కాని నితిన్ గడ్కరీ మాటలను సీరియస్ గా తీసుకుంటే పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.