PGCIL Recruitment : బీటెక్ చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారేంటీ…ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు

  • Written By:
  • Updated On - March 28, 2023 / 09:01 AM IST

బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులకు శుభవార్త. (PGCIL Recruitment)బీటెక్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సంపాదించడం గ్యారెంటీ. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‎లో పలు విభాగాల్లో ఉన్న ఇంజనీర్ ట్రెయిన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఖాళీలు, అర్హతలు:

నోటిఫికేషన్‎లో భాగంగా మొత్తం 138 ఇంజనీర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ విభాగాల్లో ఈ 138 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

కాగా పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులతో ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బీఈ లేదా బీటెక్ పూర్తిచేయాలి. అంతేకాదు గేట్ 2023లో అర్హత సాధించి ఉండటం తప్పనిసరి.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‎లైన్‎లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారమ్‎కు రూ. 500చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులను గ్రూప్ డిష్కషన్ తోపాటు ఇంటర్వ్యూలో వచ్చిన మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 18గా నిర్ణయించారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి.