Corona Alert: కరోనాపై కేంద్రం హై అలర్ట్.. రెడ్ జోన్స్ గా పలు రాష్ట్రాలు!

శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1590 పైగా కేసులు నమోదు కావడంతో  కేంద్రం ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

  • Written By:
  • Updated On - March 25, 2023 / 05:38 PM IST

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయా? పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1590 పైగా కేసులు నమోదు కావడంతో  కేంద్రం ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న వివిధ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

కరోనా కేసుల పెరుగుదలను గమనించి, ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో కరోనాపై మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇక తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలను రెడ్ జోన్స్ గా ప్రకటించాలని కేంద్రం ప్రకటించింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న కేసులు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి.

భారతదేశంలో ఒకే రోజు 1,590 తాజా కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయంటే కేసుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.  ఇది 146 రోజులలో అత్యధికం. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 8,601 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో ఆరు మరణాలతో మరణించిన వారి సంఖ్య 5,30,824 కు పెరిగింది – మహారాష్ట్ర నుండి మూడు మరియు కర్ణాటక, రాజస్థాన్ మరియు ఉత్తరాఖండ్‌లలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. తాజా కేసులతో, భారతదేశంలో కోవిడ్-19 సంఖ్య 4,47,02,257కి చేరుకుంది.