Social Media Platforms: ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు కేంద్రం నోటీసులు

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎక్స్ (X(, యూట్యూబ్ (YouTube) మరియు టెలిగ్రామ్‌తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది .

Published By: HashtagU Telugu Desk
Social Media Platforms

Social Media Platforms

Social Media Platforms: కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎక్స్ (X),  యూట్యూబ్ (YouTube) మరియు టెలిగ్రామ్‌తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు గురిచేసే అంశాలను వెంటనే తొలగించాలని వారికి సూచించారు. దీనికి సంబంధించి సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు జారీ చేయడం జరిగింది.

కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు మరియు రిపోర్టింగ్ మెకానిజమ్‌ల వంటి చర్యలను భవిష్యత్తులో అమలు చేయాలని కూడా సదరు సంస్థలకు దిశానిర్దేశం చేసింది. ఐటీ నిబంధనల ప్రకారం సురక్షితమైన మరియు విశ్వసనీయ ఇంటర్నెట్‌ను రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసింది ఈ మేరకు ఐటీ చట్టంలో నిర్దేశించిన ఖచ్చితమైన నియమాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం వాటిని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది హెచ్చరించారు.

Also Read: JP Nadda : తెలంగాణ బిజెపి నేతలకు దిశానిర్దేశం చేసిన జెపి నడ్డా

  Last Updated: 07 Oct 2023, 03:57 PM IST