Site icon HashtagU Telugu

Banned : 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం..ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న కేంద్రం.!!

Effects Of Plastic

Effects Of Plastic

ప్లాస్టిక్ ఆరోగ్యానికి ముప్పు అన్న సంగతి తెలిసిందే. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమనీ తెలుసు. కానీ ప్లాస్టిక్ లేనిది ఉండలేం. పాల ప్యాకెట్ నుంచి లంచ్ బాక్స్ వరకు ప్రతీదీ ప్లాస్టిక్ తోనే ముడిపడి ఉంది. మనం కూడా ప్లాస్టిక్ అంతలా అతుక్కుపోయాం. వాటిలో ఉండే కెమికల్స్ వల్ల ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నా…ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. మనిషి జీవితంలో ఒక భాగంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించినా…అమల్లో మాత్రం కనిపించడం లేదు. కానీ ఇప్పుడు ఏకంగా 16 రకాలైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. ఏయో వస్తువులపై నిషేధం విధించిందో తెలుసుకుందాం.!!!

16 రకాలైన ప్లాస్టిక్ వస్తువులపై జూలై 1 నుంచి నిషేధం అమల్లోకి రానుంది. నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల్లో ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల వరకు ఉన్నాయి. అంతేకాదు ప్లాస్టిక్ ముడిపదార్థాలను సరఫరా చేయోద్దని కూడా పెట్రో కమికల్ సంస్థలను ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్రం నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐసీ క్రీం కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్ల లోపు పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్ వంటి వస్తువులపై నిషేధం విధించింది.

ఇక ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు ఎలాంటి ప్లాస్టిక్ ముడి సరుకులను సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం విధించిన నిబంధనలను ఉల్లఘించినట్లయితే ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సంబంధిత అధికారులకు సూచించింది.

Exit mobile version