Govt Employees : ఆలస్యంగా ఆఫీస్ కు వస్తాం అంటే కుదరదు..ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వార్నింగ్

ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది

  • Written By:
  • Publish Date - June 22, 2024 / 12:00 PM IST

ప్రభుత్వ ఆఫీసుల్లో పని జరగాలంటే బాధితుల చెప్పులు అరగాల్సిందే..ప్రభుత్వ ఉద్యోగులు (Govt Employees) ఎప్పుడు వస్తారో తెలియదు..వచ్చిన పని చేస్తారో లేదో అర్ధం కాదు..మీటింగ్ ల పేరుతో కాలక్షేపం చేస్తారు..భోజన విరామం అని చెప్పి ఇంటికెళ్లి …మళ్లీ ఎప్పుడు వస్తారో..అసలు వస్తారో రారో కూడా తెలియదు. ఒకేవేళ వచ్చిన చేతిలో ఎంతో కొంత డబ్బు పెట్టనిది పనిచేయరు..డబ్బు ఇచ్చిన పనిచేస్తారని గ్యారెంటీ లేదు…ఇది ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగుల పనితీరు. ఇలాంటి పని తీరులకు కేంద్రం చెక్ పెడుతుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమయం విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం 9:15 లోగా బయోమెట్రిక్ లో హాజరు పడకపోతే ఆ పూటకు లీవ్ పెట్టుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కరోనా ముందు వరకు ప్రభుత్వ ఆఫీస్ లలో బయోమెట్రిక్ ఉండేది..కానీ కరోనా టైమ్ లో వైరస్ భయంతో బయోమెట్రిక్ హాజరుకు స్వస్తి పలికి..రిజిస్టర్లు బయటకు తీశారు. దీంతో ఎంత లేట్ గా వచ్చినా ఇన్ టైంలోనే వచ్చినట్లు అందులో నమోదు చేయడం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ.. ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగే అవకాశం ఉందనుకుంటే ముందుగానే తనపై అధికారికి సమాచారం ఇచ్చి, ఆ పూటకు క్యాజువల్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా సాయంత్రం 5:30 తర్వాతే ఔట్ పంచ్ పడాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల ఫై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే..ఉద్యోగులు మాత్రం ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రం పూట చాలా పొద్దుపోయేదాక పనిచేస్తున్నామని..నియమిత పనిగంటలకు మించి తాము పనిచేస్తున్నామని, ఒక్కోసారి ఇంటి వద్ద నుంచి కూడా పనిచేస్తున్నామని చెప్పుకొస్తున్నారు.

Read Also : Venkatesh : వెంకటేష్ హీరోయిన్ గా మీనాక్షి కాదా.. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తున్నారా..?