Site icon HashtagU Telugu

Union Cabinet : రేపు కేంద్ర క్యాబినేట్‌ సమావేశం

Central cabinet meeting tomorrow

Central cabinet meeting tomorrow

Union Cabinet Meeting: రేపు (గురువారం) ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ(pm modi) అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరుగనుంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే బడ్జెట్‌ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర క్యాబినెట్‌ భేటి కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నెల 23న (మంగళవారం) పార్లమెంటులో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఆగస్టు 12న ఈ బడ్జెట్‌ సమావేశాలు(Budget meetings) ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రక్యాబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ సెషన్‌ నిర్వహణకు సంబంధించి చర్చ జరుగుతుందని మీడియా కథనాలు వెల్లడవుతున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ రేపు సాయంత్రం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు పార్టీ శ్రేణులతో ప్రధాని సమావేశం కానున్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో పార్టీ అనుసరించబోయే వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు.. మహరాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు ప్రధాని దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

Read Also: Hair Grow : మీ జట్టు మోకాళ్ల వరకు పొడవుగా పెరుగాలా.. ఈ ఆకులో వీటిని కలిపి రాసుకోండి..!