కేంద్ర ప్రభుత్వం (Central Cabinet) ప్రజల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని 2025-26 వరకు కొనసాగించాలని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ (Free Gas) కనెక్షన్లు అందిస్తారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 10.33 కోట్ల కుటుంబాలు ప్రయోజనం పొందాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ పొడిగింపు ద్వారా మరింత మంది పేదలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Income Tax Bill 2025: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాత ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు ఉపసంహరణ!
ఈ పథకం కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.12,060 కోట్లు కేటాయించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రజలపై గ్యాస్ ధరల భారం పడకుండా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (OMCs) రూ.30,000 కోట్ల రాయితీని ఇచ్చేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రాయితీ ద్వారా గ్యాస్ ధరలు స్థిరంగా ఉండేలా చూస్తూ, ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
పీఎం ఉజ్వల యోజన పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళల కష్టాలు చాలా వరకు తగ్గాయని, కట్టెల పొయ్యిల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం పొడిగింపుతో మరింత మంది మహిళలు సురక్షితమైన, శుభ్రమైన ఇంధనాన్ని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మంచి పరిణామమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.