Central Cabinet : కేంద్ర కేబినెట్ సమావేశం.. రైతులకు వరాలు.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్(Central Cabinet) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా రైతులకు వరాలు కురిపించారు.

  • Written By:
  • Publish Date - June 7, 2023 / 07:21 PM IST

నేడు జూన్ 6 బుధవారం ఉదయం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్(Central Cabinet) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలను తీసుకున్నారు. ముఖ్యంగా రైతులకు వరాలు కురిపించారు. పలు పంటలకు మద్దతు ధరను భారీగా పెంచారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) మీడియాకు వెల్లడించారు.

2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు వివిధ పంటలకు పెంచిన మద్దతు ధరలు ఇవే..

వరి ఏ గ్రేడ్ క్వింటాకు రూ.143 పెంపు.. దీంతో రూ. 2203కి చేరిన క్వింటా మద్దతు ధర

వరి సాధారణ గ్రేడ్ క్వింటాకు రూ.143 పెంపు… రూ.2183కి చేరిన క్వింటా మద్దతు ధర

కందులు క్వింటాకు రూ.400 పెంపు… రూ.7000 చేరిన క్వింటా మద్దతు ధర

రాగులు క్వింటాకు రూ.268 పెంపు.. రూ.3846కి చేరిన క్వింటా మద్దతు ధర

పెసర్లు క్వింటాకు రూ.803 పెంపు.. రూ.8558 కి చేరిన క్వింటా మద్దతు ధర

మినుములు క్వింటాకు రూ.350 పెంపు.. రూ 6950 కి చేరిన క్వింటా మద్దతు ధర

సన్ ఫ్లవర్ గింజలు క్వింటాకు రూ. 360 పెంపు.. రూ.6760 కి చేరిన క్వింటా మద్దతు ధర

వేరుశెనగ క్వింటాకు రూ. 527 పెంపు.. రూ.6377 కి చేరిన క్వింటా మద్దతు ధర

సజ్జలు క్వింటాకు రూ.150 పెంపు.. రూ.2500 కి చేరిన క్వింటా మద్దతు ధర

మొక్కజొన్నలు క్వింటాకు రూ.128 పెంపు.. రూ.2090 కి చేరిన క్వింటా మద్దతు ధర

జొన్నలు హైబ్రిడ్ క్వింటాకు రూ.210 పెంపు.. రూ.3180 కి చేరిన క్వింటా మద్దతు ధర

జొన్నలు సాధారణ రకం క్వింటాకు రూ.235 పెంపు.. రూ.3225 కి చేరిన క్వింటా మద్దతు ధర

సోయాబీన్ ధర క్వింటాకు రూ.300 పెంపు.. రూ. 4600 కి చేరిన క్వింటా మద్దతు ధర

పత్తి మీడియం రకం క్వింటాకు రూ.540 పెంపు.. రూ.6620 కి చేరిన క్వింటా మద్దతు ధర

పత్తి పొడుగు రకం క్వింటాకు రూ.640 పెంపు.. రూ.7020 కి చేరిన క్వింటా మద్దతు ధర

నువ్వులు క్వింటాకు రూ.805 పెంపు.. రూ. 8365 కి చేరిన క్వింటా మద్దతు ధర పెంచిన ఈ మద్దతు ధరలతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీటితో పాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హుడా సిటీ సెంటర్ నుండి సైబర్ సిటీ వరకు మెట్రో కనెక్టివిటీకి ఓకే చెప్పింది. 5,452 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను 27 స్టేషన్లతో 28.50 కి.మీ మెట్రో మార్గంతో నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ మంజూరైన తేదీ నుండి 4 సంవత్సరాలలో మెట్రో లైన్ పూర్తి చేయాలనీ నిర్ణయించారు. మెట్రో ప్రాజెక్టు తో ఎన్సీఆర్ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని కేంద్రమంత్రి వర్గం వెల్లడించారు.

 

Also Read : Business Ideas: నెలకు లక్ష రూపాయలలోపు సంపాదించే అవకాశం.. కష్టపడితే చాలు..!