Site icon HashtagU Telugu

CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Cbi

Cbi

CBI Recruitment 2023: ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా…ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 5వేలకుపైగా అప్రెంటీస్‎ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 20, 2023, సోమవారం బ్యాంక్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఢిల్లీలో 141, ఉత్తరప్రదేశ్‌లో 615, బీహార్‌లో 526, జార్ఖండ్‌లో 46, రాజస్థాన్‌లో 192, ఉత్తరాఖండ్‌లో 41, 108 సహా మొత్తం ఐదు వేల అప్రెంటీస్ ఖాళీలు ఉన్నాయి. దీనితో పాటు, నిర్ణీత ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు పని చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. గరిష్టంగా నెలకు రూ. 15,000 స్టైఫండ్ ఇవ్వనుంది.

వివిధ రాష్ట్రాల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రకటించిన 5000 కంటే ఎక్కువ అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తితోపాటు అర్హతగల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inలో అందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలతో అంటే మార్చి 20 నుండి ప్రారంభమైంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఏదైనా ఇతర ఉన్నత విద్యా సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే, మీరు దరఖాస్తు చేస్తున్న ప్రాంతంలోని స్థానిక భాషపై కూడా పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31 మార్చి 2023 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 28 ఏళ్లు మించకూడదు. అయితే, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

పూర్తి సమాచారం కోసం బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేసుకోండి.

Exit mobile version