Site icon HashtagU Telugu

Delhi : ‘శీష్‌ మహల్‌’ పై విచారణకు కేంద్రం ఆదేశం

Center orders inquiry into 'Sheesh Mahal'

Center orders inquiry into 'Sheesh Mahal'

Delhi : ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్‌ మహల్‌’ వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే ఆ బంగ్లాపై వస్తున్న ఆరోపణలపై కేంద్రం తాజాగా విచారణకు ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రజాపనుల విభాగం (CPWD) వాస్తవ నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి 13న ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో 6 ఫ్లాగ్‌స్టాఫ్ బంగ్లాను పునరుద్ధరణకు ఆప్‌ ప్రభుత్వం భవన నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విచారించి సమగ్ర నివేదిక తయారుచేయాలని కేంద్రం సీపీడబ్ల్యూడీని ఆదేశించింది.

Read Also: Donald Trump : ఏప్రిల్ 2 నుంచి ఆటోమొబైల్ పై టారిఫ్‌లు: డొనాల్డ్ ట్రంప్‌

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రధాని మోడీ దగ్గర నుంచి బీజేపీ అగ్ర నేతలంతా ఈ విషయాన్ని ప్రధానంగా హైలెట్ చేశారు. ‘శీష్‌ మహల్‌’ అంటూ ఆరోపణలు గుప్పించింది. మొత్తానికి ఆప్ అధికారాన్ని కూడా కోల్పోయింది. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ హయాంలో జరిగిన అవకతవకలపై కేంద్రం దృష్టి సారించింది.

కాగా, అరవింద్‌ కేజ్రీవాల్‌ సీఎంగా ఉన్న సమయంలో ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అధికారిక నివాసంగా వినియోగించారు. ఈ బంగ్లాను ‘శీష్‌ మహల్‌ (అద్దాల మేడ)’గా బీజేపీ అభివర్ణిస్తోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7-స్టార్‌ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆప్‌ మోసాలకు ఆ మహల్‌ ఓ ఉదాహరణ అంటూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ.. తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని ప్రధాని మోడీ దుయ్యబట్టిన విషయం తెలిసిందే. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి. బీజేపీకి విజయాన్ని కట్టబెట్టాయి. అందుకే విమర్శలకు తావులేకుండా ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది.

Read Also: Balakrishna : త‌మ‌న్‌కు బాలయ్య గిఫ్ట్‌… ఏంటో తెలుసా..?