Agnipath scheme : `అగ్నివీర్` ల‌కు కేంద్రం స‌డ‌లింపులు

అగ్నిప‌థ స్కీంలో నియామ‌కం కావ‌డానికి అగ్నివీర్ ల‌కు ప‌లు స‌డ‌లింపుల‌ను కేంద్రం ఇచ్చింది. కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 02:23 PM IST

అగ్నిప‌థ స్కీంలో నియామ‌కం కావ‌డానికి అగ్నివీర్ ల‌కు ప‌లు స‌డ‌లింపుల‌ను కేంద్రం ఇచ్చింది. కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసింది. అగ్నివీర్ ఉద్యోగానికి 17.5-21 ఏళ్ల వరకు వయసున్న వారు అర్హులని తెలిసిందే. ఎంపికైన‌ అగ్నివీర్ గా నాలుగేళ్లు పనిచేసి దిగిపోయిన తర్వాత త్రివిధ దళాల్లోనే రెగ్యులర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరి కోసం 25 శాతం కోటాను కేంద్రం ముందే ప్రకటించింది. ఇప్పుడు దీనికి అదనంగా కేంద్ర ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ లు (సీఏపీఎఫ్), అస్సామ్ రైఫిల్స్ ఉద్యోగాల్లో 10 శాతం కోటాను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

అగ్రిప‌థ్ స్కీం త్రివిధ‌ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాల ఉద్యోగంపై నిరుద్యోగుల నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర‌ ఆందోళన, హింసాత్మక చర్యలు నెల‌కొన్నాయి. ఆ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం కింద ‘అగ్నివీర్’గా నాలుగేళ్లు పనిచేసిన తర్వాత కేంద్ర పోలీసు బలగాల్లో ఉద్యోగాలకు అర్హత సంపాదించుకునేందుకు వీలుగా వయోపరిమితిలోనూ మూడేళ్లపాటు సడలింపు ఇచ్చారు. సాధారణ అభ్యర్థులకు ఉండే గరిష్ఠ వయోపరిమితికి అదనంగా మూడేళ్లపాటు వీరు పోటీ పడొచ్చు. అలాగే, మొదటి బ్యాచ్ అగ్నివీర్ అభ్యర్థులకు ఐదేళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మార్చే అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. వారిని శాంతింపజేసేందుకు ఈ స‌డ‌లింపుల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.