Pakistani Nationals : భారత్‌లోని పాకిస్థానీయులు ఏప్రిల్ 30లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోం శాఖ సవరించినట్లు సమాచారం. ఆంక్షలు సడలడంతో తదుపరి ఆదేశాలు వెలువడేవరకు వారు ఆ సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు వెసులుబాటు కలిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పాక్ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఏప్రిల్ 30 వాఘా-అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్రహోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్తర్వును సవరించినట్లు సమాచారం.
Read Also: This Is The Situation : ఇదీ పాక్ పరిస్థితి! ఎంత దారుణం ఛీ..ఛీ
కాగా, పాక్ జాతీయులు గత 6 రోజుల్లో అటారీ-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు 1,465 మంది వచ్చారు. వీరిలో 25 మంది దౌత్యాధికారులు, అధికారులు, దీర్ఘకాల వీసాలు ఉన్న 151 మంది పాకిస్థాన్ జాతీయులు ఉన్నారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌ను వీడి వెళ్లాలని పాక్ జాతీయులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో బుధవారం నాటికి మొత్తం 786 మంది వెళ్లిపోయారు. వారిలో 55 మంది దౌత్యాధికారులు, వారి డిపెండెంట్లు, సహాయక సిబ్బంది, 8 మంది పాకిస్థాన్ వీసాలున్న భారతీయులున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత పాకిస్తాన్ జాతీయుల బసపై నిషేధం విధించబడింది. పాకిస్తాన్‌కు ప్రయాణించకుండా ఉండాలని ప్రభుత్వం భారతీయులకు గట్టిగా సూచించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి రావాలని సూచించారు. పాకిస్తాన్‌కు నేరుగా విమానాలు లేకపోవడంతో చాలా మంది దుబాయ్ లేదా ఇతర మార్గాల ద్వారా విమానంలో వెళ్లిపోయారు. రాష్ట్ర పోలీసులు మరియు ఇతర కేంద్ర సంస్థలు దేశంలోని వివిధ ప్రదేశాలలో నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను గుర్తిస్తుండటంతో, మరింత మంది పాకిస్తాన్ జాతీయులు దేశం విడిచి వెళ్తారని మేము ఆశిస్తున్నాము అని ఓ అధికారి తెలిపారు. కేంద్ర నిఘా సంస్థలతో సన్నిహిత సమన్వయంతో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వెరిఫికేషన్ డ్రైవ్ జరుగుతోంది.