Site icon HashtagU Telugu

Ladakh : లద్దాఖ్‌లో రిజర్వేషన్లు, స్థానికతపై కేంద్రం కీలక ప్రకటన

Center Govt key announcement on reservations and locality in Ladakh

Center Govt key announcement on reservations and locality in Ladakh

Ladakh : కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాష, సంస్కృతి, స్థానికుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అరుదైన, చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. స్థానికత ప్రమాణాలపై స్పష్టత ఇవ్వడమే కాకుండా, రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత వంటి కీలక అంశాల్లో నూతన మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 85 శాతం అవకాశాలను లద్దాఖ్‌ స్థానికులకే కేటాయించాలని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నియమాల ప్రకారం, 15 ఏళ్లకు పైగా లద్దాఖ్‌లో నివసిస్తున్నవారు, లేదా కనీసం 7 ఏళ్ల పాటు అక్కడ చదివినవారు మరియు 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షలు అక్కడే రాశినవారు స్థానికులుగా పరిగణించబడతారు. ఇది యువతకు ఉద్యోగాల్లో న్యాయం జరిగేలా చేస్తుందని అంచనా.

Read Also: IPL 2025 Final : అహ్మదాబాద్‌లో వర్షం ఆటను అంతరాయం చేయనుందా? మౌసంను గురించి పూర్తీ సమాచారం

ఇక, పై లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌లో మూడో వంతు సీట్లు మహిళలకే కేటాయిస్తారు. ఇది లింగ సమానతకు, మహిళల పాలక హక్కులకు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. గమనించదగ్గ విషయమేమిటంటే, ఆర్టికల్‌ 370 రద్దు చేసిన తర్వాత 2019లో జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. అందులో లద్దాఖ్‌ కూడా ఒకటి. అప్పటి నుంచి స్థానికులు తమ భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో, కేంద్ర ప్రభుత్వం జనవరి 2023లో నిత్యానంద రాయ్‌ నేతృత్వంలోని హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అధ్యయనం చేసి, ఈ విధంగా అమలవచ్చే మార్గదర్శకాలను రూపొందించింది.

ఇకపోతే, పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ కూడా ఈ డిమాండ్లకే మద్దతుగా అక్టోబర్ 2024లో ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. లద్దాఖ్‌కు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్షణ కల్పించాలని, స్థానిక సంస్కృతి, భాషలను కాపాడాలని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు లభించడంతో, కేంద్రం పై చర్యలకు దారి తీసినట్లు విశ్లేషకుల అభిప్రాయం. లద్దాఖ్ ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షధ్వానాలతో స్వాగతిస్తున్నారు. ఇది చాలా రోజుల నుంచి నెరవేరని ఆశ. భవిష్యత్తు తరం కోసం ఇది మేలు చేస్తుంది అంటూ స్థానిక యువకులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్య, ఉద్యోగాల్లో తమకు గుర్తింపు వస్తుందన్న విశ్వాసం పటిష్ఠమవుతోంది. ఇది కేంద్రం తీసుకున్న తొలి పూర్తి స్థాయి ప్రాంతీయ సంరక్షణ చర్యగా భావించవచ్చు. ఇకపై స్థానికుల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Read Also: Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు