Site icon HashtagU Telugu

PM Kisan : పీఎం కిసాన్ సాయం.. మరో రూ.2వేలు పెంపు ?

PM Kisan Nidhi

PM Kisan Nidhi

PM Kisan : పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం కింద దేశంలోని రైతులకు అందిస్తున్న సాయాన్ని మరో రూ.2 వేలు పెంచే ఛాన్స్ ఉంది. ఒకవేళ దీనిపై కేంద్ర సర్కారు నుంచి ప్రకటన వెలువడితే.. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేల సాయం రూ.8 వేలకు పెరుగుతుంది. పీఎం కిసాన్ సాయాన్ని రూ.2 వేలు చొప్పున పెంచితే.. కేంద్ర సర్కార్​ ఖజానాపై రూ.20వేల కోట్ల అదనపు భారం పడుతుంది.  అయితే దీనివల్ల లక్షలాది మంది చిన్న,సన్నకారు రైతులకు లబ్ధి చేకూరుతుంది.  ఈ అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు  ముందు పీఎం​ కిసాన్‌ సమ్మాన్‌ నిధి(PM Kisan) పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మూడు విడతలుగా రూ. 2 వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్‌ అకౌంట్లలో జమవుతున్నాయి. అయితే ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి పథకంలో భాగంగా కేంద్ర సర్కారు ఇప్పటివరకు 15 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం అందించింది. 16వ విడత సాయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలలో అందించనుంది. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని కూడా పెంచే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం ఈ పథకం ద్వారా పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి నెలకు 5 కేజీల చొప్పున రేషన్ సరకులను ఉచితంగా ఇస్తున్నారు. ఏప్రిల్,​ మేలో లోక్​సభ పోల్స్ జరగనున్నందున ఓటర్లను ఆకట్టుకోవడానికి కేంద్ర సర్కారు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు.

Also Read: KA Paul – Jagan : అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుంటే జగన్‌ను శపిస్తా.. కేఏ పాల్ వార్నింగ్

నంద్యాల రైతు సమాఖ్యపై ప్రధాని మోడీ ప్రశంసలు

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర భాగంగా దేశంలోని వేలాదిమంది రైతులతో జనవరి 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 102 ఏళ్ల ఓ రైతు సమాఖ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కోపరేటివ్ సొసైటీలో మొత్తం 6వందల మంది సభ్యులున్నారు. కేంద్రం ఇచ్చిన మూడుకోట్ల రుణంతో ఈ సమాఖ్య సభ్యులు ఐదు గోదాములను నిర్మించుకున్నారు. ఈ-నామ్‌, ఈ-మండి వ్యవస్థల ద్వారా పంటకు మెరుగైన ధర దక్కించుకుంటున్నారు. వికసిత భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఆ కోపరేటివ్ సొసైటీలో సభ్యుడైన మొయినుద్దీన్‌తో మాట్లాడారు. కేంద్రం పథకాలను ఎలా అందిపుచ్చుకున్నారో తెలుసుకున్నారు. సేంద్రీయ సేద్యాన్ని కూడా కొనసాగించాలని సూచించారు. కాగా పేదలు, రైతులు, మహిళలు, యువజనులు సాధికారత సాధించిన నాడే భారత్ సాధికారతను సాధించినట్లవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. అర్హులైన ప్రభుత్వ పథకాల లబ్ధిరాలందరినీ గుర్తించేలా చూడడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని మోడీ పేర్కొన్నారు.