Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్‌లో హాల్స్‌ పేర్లు మారుస్తూ కేంద్రం ప్రకటన

ఇకపై దర్బార్‌ హాల్‌ని "గణతంత్ర మండపం"గా, అశోక్ హాల్‌ని "అశోక్ మండపం"గా పిలవనున్నారు.

  • Written By:
  • Publish Date - July 25, 2024 / 03:46 PM IST

Rashtrapati Bhavan Halls Name Change : రాష్ట్రపతి భవనంలోని దర్బార్ హాల్(Durbar Hall), అశోక్ హాల్‌(Ashok Hall) పేర్లను మారుస్తూ కేంద్రం(center) కీలక ప్రకటన చేసింది. ఇకపై దర్బార్‌ హాల్‌ని “గణతంత్ర మండపం”గా, అశోక్ హాల్‌ని “అశోక్ మండపం”గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లోని ఈ రెండు ముఖ్యమైన హాళ్ల పేర్లను మార్చారు. దర్బార్‌ హాల్‌లో నేషనల్ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అశోక్‌ హాల్‌ని పార్టీల సమయంలో విందు కోసం వినియోగిస్తారు. బ్రిటీష్ కాలం నాటి “దర్బార్” పదాన్ని తొలగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకప్పుడు భారత్‌ని పరిపాలించిన వాళ్లు ఈ పేరు పెట్టుకున్నారని, ఇప్పుడు భారత్ గణతంత్ర దేశంగా మారిపోయిందని తేల్చి చెప్పింది. అందుకే దర్బార్ అనే పదాన్ని తొలగించి ఆ స్థానంలో గణతంత్ర అనే పదాన్ని చేర్చినట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవనం ఉత్తర్వులు జారీ చేసింది.

“దర్బార్ అనే పదం భారత్‌ని పరాయివాళ్లెవరో పరిపాలించినప్పటి నాటిది. ఈ పదానికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు భారత్ గణతంత్ర దేశం. పైగా గణతంత్ర అనే పదానికి భారత్‌కి విడదీయలేని బంధం ఉంది. అందుకే దర్బార్ హాల్‌కి గణతంత్ర మండపం అని పేరు పెడుతున్నాం. ఈ పేరే సరైందని మేం భావిస్తున్నాం. అశోక చక్రవర్తికి గౌరవ సూచకంగా ఓ హాల్‌కి అశోక మండపం అనే పేరు పెట్టాం. అశోక అనే పదానికి భారత దేశ సంస్కృతికి సంబంధం ఉంది. ”
We’re now on WhatsApp. Click to Join.

ఇకపోతే..అశోక్‌ హాల్‌ పేరుని అశోక్ మండపంగా మార్చింది కేంద్రం. అశోక్ అంటే ఎలాంటి బాధలూ లేకపోవడం అని అర్థం. పైగా అశోక చక్రవర్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతియుత జీవనం, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచిన అశోక చక్రవర్తికి గౌరవంగా ఈ పేరు పెట్టున్నట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, రాష్ట్రపతి భవన్‌తో సామాన్య ప్రజల అనుసంధానాన్ని పెంచేందుకు మరిన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్ తలుపులు ప్రతి ఒక్కరూ సందర్శించడానికి తెరిచి ఉన్నాయి. ఈ రెండు ముఖ్యమైన భవనాల పేర్లను మార్చడం కూడా ఈ దిశలో ఇది ఒక అడుగు.

Read Also: Health Tips: నైట్ డ్యూటీలు ఎక్కువగా చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!

Follow us