- ప్రవైట్ హాస్పటల్స్ లలో ICU చార్జీలపై కేంద్రం ఆదేశాలు
- ఐసీయూ (ICU) మరియు వెంటిలేటర్ ఛార్జీలను ఆసుపత్రిలోని పబ్లిక్ డిస్‌ప్లే బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలి
- ఎంత వైద్యం చేస్తే అంతే చార్జీలు వేయాలి
ప్రాణాన్ని నిలపెట్టాల్సిన డాక్టర్స్ ఇటీవల డబ్బుకు విలువ ఇస్తున్నారు. డబ్బు ఉంటేనే వైద్యం చేస్తాం , ప్రాణం కాపాడతాం అంటున్నారు. మనిషి బ్రతకాలని దానిని కాష్ చేసుకొని ఆస్తులు రాయించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రవైట్ హాస్పటల్స్ లలో ICU చార్జీల బాదుడు మాములుగా లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బ్రతుకుతామో లేదో అనే భయంతో ప్రవైట్ హాస్పటల్ లలో జాయిన్ అయితే, ఉన్న ఆస్తిని అమ్ముకునేలా చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు స్పష్టమైన సూచనలు చేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను చేర్చుకున్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా చేసుకుని భారీ వసూళ్లకు పాల్పడటం సరికాదని కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా అత్యవసర విభాగాల్లో (Emergency Units) చికిత్స పొందే రోగులకు సంబంధించి మానవీయ కోణంలో వ్యవహరించాలని, వైద్యం అనేది వ్యాపారంగా కాకుండా సేవగా ఉండాలని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

Icu Charges
పారదర్శకత – ICU మరియు వెంటిలేటర్ ఛార్జీల వెల్లడి ఆసుపత్రుల యాజమాన్యాలు తాము వసూలు చేసే సేవా రుసుములపై పారదర్శకత పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా, ఐసీయూ (ICU) మరియు వెంటిలేటర్ ఛార్జీలను ఆసుపత్రిలోని పబ్లిక్ డిస్‌ప్లే బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలి. రోగికి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ అందించినప్పుడు, వారు ఎంత సమయం అయితే ఆ సేవలను వినియోగించుకున్నారో ఆ సమయానికి మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలని స్పష్టం చేసింది. అనవసరంగా రోజులు లేదా గంటల లెక్కన అదనపు ఛార్జీలు వేయడం ఇకపై నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
Hsp Icu Charges
మార్కెట్ పెరుగుదల మరియు ప్రభుత్వ ముందస్తు చర్యలు వెంటిలేటర్ పరిశ్రమ మార్కెట్ విలువ 2024లో దాదాపు 207 మిలియన్ USD (సుమారు రూ.1,700 కోట్లకు పైగా) రికార్డు స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో సాంకేతికత పెరగడం మరియు అనారోగ్య సమస్యల కారణంగా ఈ మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ పరిణామాలను గమనించిన కేంద్రం, మార్కెట్ పెరిగే కొద్దీ రోగులపై భారం పడకుండా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య పరికరాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, నియంత్రణ లేకపోతే సామాన్యులు వైద్యానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని గుర్తించి, ముందస్తుగా ఈ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది.