OTT Platforms : కేంద్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌పై ఎలాంటి నియంత్రణ లేదని.. సినిమాలు, వెబ్ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్ చేయాలనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అడ్వైజరీ ని జారీ చేసింది. చిన్నారులకు ‘ఎ’ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది.
Read Also: Price Hike : మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్
ఇటీవల ఐజీఎల్‌లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా..? అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది.
కాగా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌లపై ఫిర్యాదులు అందాయి. ఐటీ రూల్స్‌లోని (2021) కోడ్ ఆఫ్ ఎథిక్స్‌ను సామాజిక మాధ్యమాలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా పాటించాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించే ఏ కంటెంట్‌ను ప్రసారం చేయకూడదు. వయస్సు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలి. స్వీయ నియంత్రణ కలిగిన ఓటీటీలు నైతిక విలువలను పాటించాలి అని ఆ ప్రకటనలో వెల్లడిచింది.
Read Also: Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం