Jodo Yatra :`భార‌త్ జోడో` యాత్ర‌లో మేధావులు, సెల‌బ్రిటీల వెల్లువ‌

కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ `భార‌త్ జోడో యాత్ర‌`(Jodo Yatra)కు సెల‌బ్రిటీలు, మేధావుల సంఘీభావం పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 15, 2022 / 02:53 PM IST

కాంగ్రెస్ యువ‌నేత రాహుల్(Rahul) గాంధీ `భార‌త్ జోడో యాత్ర‌`(Jodo Yatra)కు సెల‌బ్రిటీలు, మేధావుల సంఘీభావం పెరుగుతోంది. ప్ర‌త్యేకించి మోడీ పాల‌నతో అస‌హ‌నంగా ఉన్న `అవార్డ్ వాప‌సీ` బ్యాచ్ తో పాటు ఆర్థిక మేధావి ర‌ఘురామ్ రాజ‌న్ కూడా చేయి క‌లప‌డం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఆర్‌బీఐ(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. ఆయ‌న రాహుల్ గాంధీతో క‌లిసి పాద‌యాత్ర చేశారు. గ‌త కొంత కాలంగా మోడీ ప్రభుత్వ ఆర్థిక మరియు సామాజిక విధానాల గురించి రఘురామ్ రాజన్ తరచుగా ఆందోళనలు లేవనెత్తిన విష‌యం విదిత‌మే. భారతదేశ భవిష్యత్తు ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని, దాని సంస్థలను బలోపేతం చేయడంలో ఉంద‌ని ఆయ‌న ప‌లుమార్లు చెప్పారు. నోట్ల రద్దు వంటి నిర్ణయాలను తీవ్రంగా విమర్శించిన ఆర్థిక మేధావి రాజన్. భార‌త ఆర్థిక మందగమనానికి మోడీ ప్రభుత్వ రాజకీయ మరియు సామాజిక ఎజెండా” కారణమని రాజ‌న్ ఆరోపించ‌డం ద్వారా బీజేపీ శ్రేణుల‌కు టార్గెట్ అయ్యారు.

సెల‌బ్రిటీల సంఘీభావ యాత్ర‌

భార‌త్ జోడో యాత్ర(Jodo Yatra)ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి త‌ర‌చూ సెలబ్రిటీలు రాహుల్ పాద‌యాత్ర లో క‌నిపించారు. ఆ జాబితాలో రఘురామ్ రాజన్, పూజా భట్, అమోల్ పాలేకర్, రియా సేన్, సుశాంత్ సింగ్ తదితరులు ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం త‌రువాత రాహుల్ యాత్ర‌కు సంఘీభావం తెల‌పడానికి ముందుకొచ్చే సెల‌బ్రిటీలు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల సంఖ్య పెరుగుతోంది. అగ్రనేతల నిష్క్రమణ (తాజాగా గులాం నబీ ఆజాద్), అసమ్మతి, అంతర్గత కలహాలు (రాజస్థాన్ ఒక ఉదాహరణ) కారణంగా ఏర్పడిన అస్తిత్వ సంక్షోభాన్ని పరిష్కరించడానికి గ్రాండ్ ఓల్డ్ పార్టీ తప్పనిసరిగా ఈ భారీ మాస్-కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవాల‌ని చూస్తోంది.

సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి బయలుదేరిన ఈ యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. డిసెంబర్ 21న హర్యానాకు పాదయాత్ర చేరుతుంది. భార‌త్ జోడో యాత్ర‌(Jodo Yatra)కు తాజాగా ర‌ఘురామ్ రాజన్(RBI former governor) సంఘీభావం తెల‌ప‌డంతో కొత్త ఉత్సాహం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది. ఆయ‌న‌తో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు యాత్ర‌కు సంఘీభావం తెలిపిన సెల‌బ్రిటీల హాజ‌రును గుర్తు చేసుకుంటే కాంగ్రెస్ ఆశించిన ఫ‌లితాలు వ‌స్తున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

రాహుల్ తో సెల‌బ్రిటీలు

నవంబర్ 2న హైదరాబాద్‌లో జరిగిన భార‌త్ జోడో యాత్రంలో నటి-చిత్ర నిర్మాత పూజా భట్ పాల్గొన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పాద‌యాత్ర చిత్రాలు మరియు వీడియోలను పంచుకున్నారు. బాలీవుడ్ నటి స్వర భాస్కర్ డిసెంబర్ 1న ఉజ్జయినిలో జరిగిన యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. కాంగ్రెస్‌కు మద్దతుగా ఆమె ట్విట్టర్‌లో పాద‌యాత్ర ఫోటోల‌ను షేర్ చేశారు. పేర్కొన్నారు. సామాన్య ప్రజల ప్రేమను ఆమె ప్రశంసించారు. నటుడు సుశాంత్ సింగ్ నవంబర్ 10 న మహారాష్ట్రలోని నాందేడ్‌లో రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొని, “ప్రేమ మార్గం, సామరస్యం కష్టం” అని అన్నారు. నటీమ‌ణులు రష్మీ దేశాయ్ , ఆకాంక్ష పూరి పాదయాత్రలో రాహుల్ గాంధీ చేతులు పట్టుకుని పాద‌యాత్ర చేశారు. ప్రముఖ నటుడు అమోల్ పాలేకర్ ఆయ‌న‌ భార్య సంధ్యా గోఖలే నవంబర్ 20న మహారాష్ట్రలోని భారత్ జోడో యాత్ర చివరి రోజున బుల్దానా జిల్లాలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో భారత్ జోడో యాత్రలో పాల్గొన్న రియా సేన్, అధినేత రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. యాత్ర ప్రాముఖ్యతను తెలియజేయడానికి చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంఘీభావం తెలిపారు. గుజరాత్ , ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ అద్భుత విజయం భార‌త్ జోడో యాత్ర(jodo yatra)లో ఉత్సాహాన్ని పెంచింది.

Bharat Jodo Yatra : జోడోయాత్ర‌లో బుల్లెట్ రైడ్ చేసిన రాహుల్ గాంధీ