దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (Ratan Tata) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన బుధువారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్త తెలిసి యావత్ ప్రజానీకం శోకసంద్రంలో మునిగిపోయారు. రతన్ టాటా విజయాలు , విజయం వెనుక ఆయనపడిన కృష్టి..తాను చేసిన సేవలు, సాయాలు ఇలా ప్రతి దానిని గుర్తు చేసుకుంటూ నివాళ్లు అర్పిస్తున్నారు. మరికాసేపట్లో ఆయన అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వం (Government of Maharashtra) అధికార లాంఛనాలతో జరపనుంది.
రతన్ టాటా భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులు అర్పించేందుకు ప్రజలు, రాజకీయ నేతలు , సినీ , బిజినెస్ వర్గీయులు పెద్ద ఎత్తున ఎన్ సిపిఏ లాన్స్ (NCPA Ground Mumbai) కు తరలివస్తున్నారు. సాయంత్రం వరకు పార్థివదేహాన్ని అక్కడే ఉంచనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మోడీ (PM Modi) తన ఎక్స్ పోస్ట్ లో ఆయన ఓ ‘దార్శనికుడు’(Visionary) అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా రతన్ టాటాకు తమ సంతాపం ప్రకటించారు. బుధవారం రాత్రి ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన రతన్ టాటా భౌతిక కాయాన్ని తొలుత దక్షిణ ముంబయిలోని కోలాబాలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు ప్రమఖులు, టాటా గ్రూప్ ఉన్నతాధికారులు వెళ్లి నివాళులు అర్పించారు. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రతన్ టాటా పార్థివదేహాన్ని ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌కు తరలించారు. ప్రత్యేకంగా బ్యాండు, కవాతుతో పోలీసులు ఆయన్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రధాని మోడీ లావోస్ పర్యటనకు వెళ్లినందున భారత ప్రభుత్వం తరపున రతన్ టాటా అంత్యక్రియాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Sha) పాల్గొనున్నారు.
Read Also : Prasanth Varma Mahakali: పీవీసీయూలో మరో క్రేజీ అనౌన్స్మెంట్ చేసిన ప్రశాంత్ వర్మ