భారతదేశ గగనతల చరిత్రలో అనేక మంది ప్రముఖులు విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాల్లో ప్రాణాలు (Celebrities Died in Plane Crashes) కోల్పోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) పదవిలో ఉండగానే నల్లమల్ల అటవీ ప్రాంతంలో బెల్ 430 హెలికాప్టర్ కూలి మరణించగా, లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న జీఎంసీ బాలయోగి (Balayogi) కూడా హెలికాప్టర్ ప్రమాదంలోనే చనిపోయారు. అంతేకాక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా, బీజేపీ నేత సౌందర్య వంటి పలువురు ప్రముఖులు కూడా ఇటువంటి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
హెలికాప్టర్లు, విమానాల్లో జరిగిన విషాద ఘటనలు
భారత అణు శాస్త్రవేత్త హోమీ భాభా 1966లో స్విస్ ఆల్ప్స్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రాణాలు కోల్పోవడం దేశానికి తీరని లోటుగా మారింది. అలాగే 1980లో సంజయ్ గాంధీ ఢిల్లీ సమీపంలో గ్లైడర్ ప్రమాదంలో మరణించగా, 1994లో హిమాచల్ పర్వతాల్లో పంజాబ్ గవర్నర్ సురేంద్రనాథ్ కుటుంబంతోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. CDS జనరల్ బిపిన్ రావత్ కూడా 2021లో తక్కువ విజిబిలిటీ కారణంగా జరిగిన హెలికాప్టర్ క్రాష్‌లో తన భార్యతో సహా మరణించారు.
ఇప్పుడు అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది. అంతకు ముందు అరుణాచల్ సీఎం డోర్జీ ఖండూ, మంత్రి డెరా నటుంగ్, మేఘాలయ మంత్రి సంగ్మా వంటి రాజకీయ నేతలు కూడా హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించారు. ఈ విధంగా గగనతల ప్రమాదాలు దేశానికి విలువైన నాయకులను కోల్పోయేలా చేశాయి.