Site icon HashtagU Telugu

Tillu Tajpuriya : తీహార్ జైల్ గ్యాంగ్ వార్.. ఏకంగా 100 సార్లు పొడిచి చంపారు.. సీసీటీవీలో నమోదు..

CCTV Footage shows how gangster Tillu Tajpuriya murdered with stabbed 100 times

CCTV Footage shows how gangster Tillu Tajpuriya murdered with stabbed 100 times

ఢిల్లీ(Delhi)లోని తీహార్(Tihar) జైల్లో రెండు రోజుల క్రితం గ్యాంగ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో రోహిణి కోర్టు కాల్పుల కేసు నిందితుడిగా ఉన్న టిల్లు తాజ్ పురియాను( Tillu Tajpuriya) ప్రత్యర్థి యోగేష్ తుండా ముఠా కొట్టి చంపారు. యోగేష్ అతని అనుచరులు టిల్లు తాజ్ పురియాపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తాజ్ పురియాను జైలు సిబ్బంది ఢిల్లీలోని హాస్పిటల్ కి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.

మంగళరం మే 2న తీహార్ జైల్లో టిల్లు తాజ్ పురియా హత్యకు గురయ్యాడు. పక్కా ప్లాన్ ప్రకారమే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టిల్లు తాజ్ పురియా గదికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న యోగేశ్ ముఠా బెడ్ షీట్స్ సహాయంతో పై నుంచి కిందకి దిగి కత్తులు, కొడవళ్లు లాంటి మారణాయుధాలతో టిల్లు తాజ్ పురియాని పొడిచి, కొట్టి చంపేశారు. అతను తప్పించుకుందామని ట్రై చేసినా సెల్ నుంచి బయటకు లాగి మరీ చంపారు.

అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది. పలువురు ఖైదీలు మొదటి అంతస్థు నుంచి కిందకు బెడ్ షీట్స్ సహాయంతో దిగడం రికార్డు అయింది. ఓ ఆరుగురు వ్యక్తులు టిల్లు తాజ్ పురియాని సెల్ నుంచి బయటకు లాగి మరీ వీపు, భుజాలు, మెడపై.. ఇలా అతని శరీరంపై తాము తెచ్చుకున్న ఆయుధాలతో పొడిచి పొడిచి చంపడం కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఏకంగా ఓ 100 సార్లు దారుణంగా కొట్టి పొడిచి చంపినట్టు సీసీటీవీ లో రికార్డ్ అవ్వడంతో ఈ వీడియో బయటకు రాగా వైరల్ గా మారింది.

జైల్లో టిల్లు తాజ్ పురియాని కొట్టి చంపిన కేసులో యోగేష్ తో పాటు దీపక్, రాజేష్, రియాజ్ ఖాన్ అనే ఖైదీలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఉన్న మరికొందరిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తీహార్ జైలు అధికారులు తెలిపారు.

ఇక టిల్లు తాజ్ పురియా మరియు అతని గ్యాంగ్ 2021 సెప్టెంబర్ 24న గ్యాంగ్ స్టర్ జితేందర్ గోగిని కోర్టు భవవనంలోనే కాల్చి చంపారు. న్యాయవాదుల దుస్తుల్లో కోర్టు భవనంలోకి వచ్చిన టిల్లు గ్యాంగ్ కాల్పులు జరిపి జితేందర్ గోగిని హత్య చేశారు. ఈ కేసులోనే టిల్లు తాజ్ పురియా తీహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇలా అకస్మాత్తుగా హత్యచేయబడ్డాడు.

 

Also Read :  Police Threatening Teacher “ఒక్క సెకనులో టెర్రరిస్టుగా ప్రకటిస్తా’’.. టీచర్‌ని బెదిరించిన పోలీస్