Site icon HashtagU Telugu

CBSE – No Grades : ఇక నుంచి బోర్డ్ ఎగ్జామ్స్​లో నో గ్రేడ్స్.. సీబీఎస్ఈ కీలక నిర్ణయం​

CBSE Board

CBSE Board

CBSE – No Grades : ఇక నుంచి 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్‌లలో మార్కుల శాతం, గ్రేడ్​లను ఇవ్వబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) ప్రకటించింది. ఉన్నత విద్య లేదా ఉద్యోగంలో మార్కుల శాతం అవసరమైతే.. అడ్మిషన్ ఇచ్చిన సంస్థే విద్యార్థి ఐదు బెస్ట్ సబ్జెక్ట్​లను నిర్ణయించుకోవాలని సూచించింది. కొన్నాళ్ల క్రితమే మెరిట్ జాబితాను విడుదల చేసే పద్ధతిని సీబీఎస్​ఈ తొలగించింది. ఇప్పుడు తాజాగా ఈ మార్పుపై అనౌన్స్‌మెంట్ చేసింది. ఈమేరకు వివరాలను సీబీఎస్​ఈ ఎగ్జామినర్ భరద్వాజ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

  • నేషనల్​ ఎడ్యుకేషన్ ​ పాలసీ(ఎన్​ఈపీ)-2020 సిఫార్సుల మేరకు సీబీఎస్ఈ ఈ ఏడాది చాలా కీలక నిర్ణయాలను తీసుకుంది.
  • సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు రాయడం తప్పనిసరేమీ కాదని కేంద్ర విద్యాశాఖ అక్టోబరు 8న ప్రకటించింది.  సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
  • వచ్చే (2024) విద్యా సంవత్సరం నుంచి ​ పరీక్షలలో అత్యధిక మార్కులు మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలకే కేటాయిస్తామని  సీబీఎస్ఈ తెలిపింది. షార్ట్, లాంగ్ ఆన్సర్​ టైప్​ ప్రశ్నలకు ఇంతకుముందు ఉన్న మార్కుల వెయిటేజీని తగ్గిస్తామని వెల్లడించింది.
  • విద్యార్థులు రాసే జవాబు పత్రాల వ్యాల్యుయేషన్‌ పద్ధతిలోనూ  పలు మార్పులు చేస్తామని సీబీఎస్ఈ(CBSE – No Grades) పేర్కొంది.

Also Read: Sim Card – New Rules : నేటి నుంచే సిమ్‌కార్డుల జారీపై కొత్త రూల్స్.. ఎందుకు ?