సీబీఎస్ఈ (CBSE) 10th, 12th బోర్డుల లక్షల మంది విద్యార్థులు తమ ఫలితాల (Result) కోసం ఎదురు చూస్తున్నారు. సీబీఎస్‌ఈ 10వ, 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. అదే సమయంలో నివేదిక ప్రకారం.. బోర్డు అనేక సబ్జెక్టుల కాపీ తనిఖీని కూడా పూర్తి చేసింది. అయితే ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయమై సీబీఎస్ఈ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మీడియా నివేదికల నుండి అందిన సమాచారం ప్రకారం.. CBSE ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో ఫలితాలను విడుదల చేయవచ్చు.
ప్రస్తుతానికి ఫలితాలు సంబంధిత అప్‌డేట్‌ల కోసం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inని గమనించాలని సూచించారు. ఫలితాలు కూడా ఈ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. ఫలితాలను విడుదల చేయడానికి బోర్డు ఎటువంటి తేదీని ధృవీకరించలేదు. అయితే ఈ నెలాఖరు లేదా మేలో ప్రకటించవచ్చు.
Also Read: జాక్ డోర్సే ఇన్నోవేషన్: ట్విట్టర్ కు పోటీగా బ్లూ స్కై..అందుబాటులోకి ఆండ్రాయిడ్ యాప్
నివేదికల ప్రకారం.. ప్రస్తుతం CBSE ద్వారా 12వ తరగతికి కాపీ చెకింగ్ జరుగుతోంది. కాపీ చెకింగ్ ప్రక్రియ వారం లేదా పది రోజుల్లో పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ కాపీలు మార్కులతో పాటు ప్రాంతీయ కార్యాలయాలకు పంపబడతాయి. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత, తుది ఫలితాన్ని సిద్ధం చేయడానికి 1-2 వారాలు పడుతుంది.
అధికారిక CBSE తేదీ షీట్ 2023 ప్రకారం.. CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 21న ముగియగా, CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు ఏప్రిల్ 5, 2023న ముగిశాయి. సీబీఎస్ఈ 10వ తరగతిలో 21,86,940 మంది విద్యార్థులు, 12వ తరగతిలో 16,96,770 మంది విద్యార్థులు అంటే మొత్తం 38,83,710 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు అర్హత సాధించారు. CBSE 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఫలితాలతో పాటు, బోర్డు బాలికలు, అబ్బాయిల ఉత్తీర్ణత శాతం, టాపర్ల జాబితా, కంపార్ట్‌మెంటల్ పరీక్ష వివరాలను కూడా విడుదల చేస్తుంది.