CBSE: పరీక్షల తేదీపై CBSE కీలక ప్రకటన! వివరాలు ఇదిగో!

10వ తరగతి , ఇంటర్మీడియట్ విద్యార్థులు 2023 బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో CBSE కీలక ప్రకటన చేసింది.

  • Written By:
  • Updated On - December 29, 2022 / 05:30 PM IST

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి , ఇంటర్మీడియట్ విద్యార్థులు 2023 బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో CBSE కీలక ప్రకటన చేసింది. 10వ తరగతి, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ తరగతుల వారికి జనవరి 02 నుండి జనవరి 14 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని వెల్లడించింది.

జనవరి 2 నుంచి ఫిబ్రవరి 14 మధ్య విద్యార్థుల ప్రాక్టికల్ స్కోర్‌లు ఇంటర్నల్ గ్రేడ్‌లను వెబ్ సైట్లో అప్‌లోడ్ చేయాలని సీబీఎస్ఈ సూచించింది. ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం మాత్రమే ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలని విద్యార్థులకు సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పరీక్ష రోజున గైర్హాజరయ్యే విద్యార్థులకి.. గడువు తేదీలోపు ఎప్పుడైనా ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయబడుతుంది. విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు/ప్రాజెక్ట్ అసెస్‌మెంట్/ఇంటర్నల్ అసెస్‌మెంట్‌ కు హాజరుకావచ్చు.

త్వరలోనే పరీక్షల డేట్‌షీట్ విడుదలైన తర్వాత, విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in, cbse.nic.in లను సందర్శించి..అక్కడే వారి డేట్‌షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.CBSE బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి షురూ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన డేట్ షీట్ , టైం టేబుల్ త్వరలో విడుదల చేస్తారని సమాచారం. అయితే, బోర్డు ఇటీవల చేసిన ఒక ప్రకటన ప్రకారం..విదేశాలలో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి స్టార్ట్ అవుతున్నాయి.మన దేశంలో కూడా అదే తరహాలో ఫిబ్రవరి 15 నుంచే వార్షిక పరీక్షలు నిర్వహించే అంశాన్ని cbse పరిశీలిస్తోంది.

CBSE పరీక్షల షెడ్యూల్ వచ్చాక డేట్‌షీట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

* డేట్ షీట్ విడుదలైన తర్వాత, ముందుగా CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inకి వెళ్లండి.

* హోమ్ పేజీలో CBSE 10వ మరియు 12వ బోర్డ్ ఎగ్జామ్ 2023 తేదీషీట్ యొక్క PDF లింక్ కనిపిస్తుంది.

* విద్యార్థులు 10వ లేదా 12వ తరగతి పరీక్షల డేట్ షీట్‌పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

* విద్యార్థులు డేట్‌షీట్‌ని ప్రింటవుట్ తీసుకొని తమ వద్ద ఉంచుకోవచ్చు.