సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్ష ఫలితాలను (CBSE Class 12 Results) ప్రకటించింది. ఈసారి కూడా 12వ తరగతి పరీక్షల్లో బాలుర కంటే బాలికలే మెరుగ్గా నిలిచారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత శాతం 6 శాతం ఎక్కువగా (90.68 శాతం) వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే.. 99.91 శాతం ఉత్తీర్ణత శాతంతో 12వ తరగతి CBSE ఫలితాల్లో త్రివేండ్రం టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ సంవత్సరం దేశంలో సగటున 87.33 శాతం మంది విద్యార్థులు 12వ తరగతిలో ఉత్తీర్ణులయ్యారని CBSE తెలిపింది. CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలకు 16,96,770 మంది హాజరు కాగా.. వీరిలో బాలురు 7,45,433 మంది, బాలికలు 9,51,332 మంది ఉన్నారని పేర్కొంది. విద్యార్థులు పరీక్ష ఫలితాలను (CBSE Class 12 Results) సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మార్కుల విషయంలో విద్యార్థుల మధ్య అనారోగ్య పోటీని నివారించడానికిగానూ CBSE ఈ సంవత్సరం కూడా దాని బోర్డు ఫలితాల్లో విద్యార్థులకు మొదటి, రెండో, మూడో డివిజన్‌ను ఇవ్వబోమని తెలిపింది.
ALSO READ : CBSE 10th Results : సీబీఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ ఆ డేట్ తర్వాతే..
6 అంకెల డిజి లాకర్ సెక్యూరిటీ పిన్ విడుదల
12వ తరగతి ఫలితాల కోసం బోర్డు ఇప్పటికే 6 అంకెల డిజి లాకర్ సెక్యూరిటీ పిన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా విద్యార్థులు తమ మార్క్‌షీట్ (మార్క్ షీట్), మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో డిజిలాకర్ నుంచి పొందొచ్చు. డిజిలాకర్ కోసం సెక్యూరిటీ పిన్ జారీ చేయాలని సిబిఎస్‌ఇ సంబంధిత అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. CBSE ద్వారా ఫలితాలను విడుదల చేసిన తర్వాత, ఇప్పుడు విద్యార్థులు తమ మార్క్‌షీట్, మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను DigiLockerలో డౌన్‌లోడ్ చేసుకోగలరు. పిన్ ద్వారా ఏ స్థాయిలోనూ తప్పులు జరిగే అవకాశం ఉండదని బోర్డు చెబుతోంది. వాస్తవానికి, గత సంవత్సరం నుండి, CBSE బోర్డు విద్యార్థుల ముఖ్యమైన డేటాను సురక్షితంగా ఉంచడానికి DigiLocker కోసం ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.12వ బోర్డు ఫలితాల విడుదలతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో మొదటి సెమిస్టర్‌కు సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియను కూడా మొదలు కానుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కొత్త సెషన్‌ను ఆగస్టు 1 నుంచి ప్రారంభించవచ్చని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. త్వరలోనే 10వ తరగతి ఫలితాలను కూడా ప్రకటిస్తామని CBSE తెలిపింది.