Site icon HashtagU Telugu

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో నేడు సీబీఐ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న మ‌నిష్ సిసోడియా

Manish Imresizer

Manish Imresizer

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ నేడు (సోమవారం) విచారించనుంది. సిసోడియా ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజ‌రవ్వ‌నున్నారు. సీబీఐ సమన్లు ​​సిసోడియా గుజరాత్ ఎన్నిక‌ల పర్యటనను ఆపడానికి చేసిన వ్యూహం తప్ప మరొకటి కాదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ లో పేర్కొన్నారు సిసోడియా ఇంటి నుంచి ఏమీ దొరకలేదు. అతని లాకర్లలో కూడా ఏమీ దొరకలేదు. ఈ కేసు పూర్తిగా బోగస్ కేసని ఆయ‌న తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం సిసోడియా గుజరాత్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆయన గుజరాత్‌లో పర్యటించకుండా అరెస్టు చేయాలని చూస్తున్నార‌ని.. కానీ త‌మ ప్రచారం ఆగదని కేజ్రీవాల్ తెలిపారు

ఎక్సైజ్ పాలసీలో చేసిన మార్పులపై సీబీఐ ఆయనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 144.36 కోట్ల రూపాయలను ఎందుకు మాఫీ చేశారని సీబీఐ సిసోడియాను అడిగే అవ‌కాశం ఉంది. ఢిల్లీ పోలీసులు సిసోడియా ఇంటి బయట 144 సెక్షన్ విధించారు. సోమవారం ఆప్ కార్యకర్తల నిరసన సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనేక మంది పోలీసు సిబ్బందిని కూడా మోహరించారు.