Bank Fraud : భారత్ లో బయటపడ్డ మరో భారీ బ్యాంకు మోసం…DHFLపై సీబీఐ కేసు నమోదు..!!

భారత్ లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరింది. ఏకంగా 1 7 బ్యాంకులను రూ. 34.615కోట్ల మేర ముంచారు DHFLప్రమోటర్లు కపిల్, దీరజ్, సుధాకర్ శెట్టి.

  • Written By:
  • Publish Date - June 22, 2022 / 08:56 PM IST

భారత్ లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరింది. ఏకంగా 1 7 బ్యాంకులను రూ. 34.615కోట్ల మేర ముంచారు DHFLప్రమోటర్లు కపిల్, దీరజ్, సుధాకర్ శెట్టి. వీరిపై CBIకేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా డీహెచ్ఎఫ్ఎల్ కు చెందిన 15చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అంతేకాదు ఈ మోసంలో భాగం ఉందన్న ఆరోపణలతో అమరిల్లీస్ రియల్టర్స్ కు చెందిన సుధాకర్ శెట్టితోపాటు మరో ఆరుగురు బిల్డర్లపైనా CBIకేసులు నమోదు చేసింది.

UBIనేతృత్వంలోని 17బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 వరకు విడతల వారీగా DHFLరూ. 42.871కోట్ల రుణాలు తీసుకుంది. అందులో కొంత మొత్తాన్ని చెల్లించిన ఆ సంస్థ ఇంకా బ్యాంకుల కన్సార్టియనికి 34, 615కోట్ల బకాయి ఉంది. 2019 నుంచి బకాయిలను చెల్లించడం లేదని DHFLపై సీబీఐ అధికారులకు యూబీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు బుధవారం ముంబైలోని సంస్థ కార్యాలయాలతోపాటు పలు చోట్ల సోదాలు చేపట్టింది.

ఈ వ్యవహారంపై ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే సీబీఐ అధికారులకు యూబీఐ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేసింది సీబీఐ. DHFL అక్రమాలకు పాల్పడిందన్న ప్రాథమిక నిర్ధారణతో కేసులు నమోదు చేసింది. యూబీఐ జరిపిన ఆడిట్ లో భాగంగా DHFLభారీ అక్రమాలకు పాల్పడిందని రుణాలుగా తీసుకున్న నిధులను దారి మళ్లించినట్లు తేలింది. ఇక YES బ్యాంకు రుణాల ఎగవేత కేసులో DHFL మాజీ ప్రమోటర్లు ఇద్దరూ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.