Site icon HashtagU Telugu

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు!

Arvind Kejriwal

Arvind Kejriwal (2)

దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలామంది సీబీఐ (CBI) విచారణను సైతం ఎదుర్కొన్నారు. ఇక మాజీ ఢిల్లీ మాజీ  ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసొడియా సీబీఐ విచారణ ఎదుర్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ (Arvind Kejriwal) కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం సాయంత్రం కొద్దిసేపటి క్రితమే నోటీసులు అందించింది. ఈ నెల 16 న ఎల్లుండి విచారణకు రావాలని సిబిఐ సమన్లు (Notice) జారీ చేసింది. కాగా మనీస్ సొసిడియో రిమాండ్ రిపోర్ట్ లో కేజ్రీవాల్ పేరు కూడా ఉంది. అయితే పరిణామాలపై ఆమ్ ఆద్మీ పార్టీ మరికొద్ది కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతోంది. ఏకంగా ముఖ్యమంత్రి కేజ్రీకి నోటీసులు జారీ చేయడం ఢిల్లీ (Delhi) రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

Also Read: Sexual Life: మగవాళ్లు సెక్స్ లో పాల్గొనకపోవడానికి కారాణాలివే!