Site icon HashtagU Telugu

karti chidambaram : ఇమ్మిగ్రేష‌న్‌ స్కామ్‌పై సీబీఐ విచార‌ణ‌

Karti Chidambaram

Karti Chidambaram

కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రంపై సీబీఐ మ‌రో కొత్త కేసును న‌మోదు చేసింది. ఇమ్మిగ్రేష‌న్ వ్య‌వ‌హారంలో రూ. 50ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ ఆ మేర‌కు విచార‌ణ జ‌రుపుతోంది. సుమారు 250 మంది చైనా పౌరులకు అక్రమంగా వీసా మంజూరు చేశారన్న ఆరోపణలపై లోక్‌సభ ఎంపీ కార్తీ చిదంబరంపై సీబీఐ తాజా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు.

చెన్నైలోని కార్తీ చిదంబరం నివాసంతో సహా దేశంలోని పలు నగరాల్లోని తొమ్మిది ప్రాంతాల్లో సీబీఐ మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించింది. చెన్నైలో మూడు, ముంబయిలో మూడు, కర్ణాటక, పంజాబ్‌, ఒడిశాలో ఒక్కొక్క బృందం చొప్పున సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సంద‌ర్భంగా కార్తీ చిదంబ‌రం ట్వీట్ చేస్తూ “నేను గణన కోల్పోయాను, ఇది ఎన్నిసార్లు జరిగింది. ఇది ఒక రికార్డ్ అయి ఉండాలిష అంటూ కార్తీ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.\

యుపిఎ హయాంలో 250 మంది చైనా పౌరులకు వీసా కల్పించేందుకు కార్తీ చిదంబరం రూ. 50 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని సిబిఐ ఆరోపించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కోసం ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్‌ఐపిబి) క్లియరెన్స్ పొందడంపై ఆయన ఇప్పటికే విచారణలో ఉన్నార‌నే విష‌యం విదిత‌మే.

Exit mobile version